జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి. పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూడు మిద్దె ఇళ్లు కూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాటి కింద ఎవరు లేకపోవడంతో.. ప్రాణ నష్టం తప్పింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత భవనాలన్ని పునాధులతో సహా నానిపోయాయి. దీంతో.. స్థానికులు తమకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.