మేడ్చల్: అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలను సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పలుకరించింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో భారీ వర్షం కురిసింది. అలాగే నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో గాలివాన బీభత్సం సృష్టించింది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వడగాల్పులకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో సోమవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 44 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదుకావడం కలవరపెడుతోంది.