ఇల్లెందు : ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. అలాగే ఇల్లందు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.