తొగుట: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 729 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఎంపీడీఓ రాజిరెడ్డి తెలిపారు. బండారుపల్లిలో 31, ఎల్.బంజేరుపల్లిలో 27, బ్రాహ్మణ బంజేరుపల్లి 11, చందాపూర్ 19, ఏటిగడ్డకిష్టాపూర్ 73, ఘనపూర్ 60, గోవర్దనగిరి 21, గుడికందుల 25, కాన్గల్ 36, లక్ష్మాపూర్ 46, లింగంపేట 27, లింగాపూర్ 23, పల్లెపహాడ్ 46, పెద్దమాసాన్‌పల్లి 40, రాంపూర్ 7, తొగుట 51, తుక్కాపూర్ 44, వరదరాజుపల్లి 20, వేములఘాట్ 42, వెంకట్రావ్‌పేట 21, ఎల్లారెడ్డిపేట47, జప్తిలింగారెడ్డిపల్లిలో 12 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల బాధితులు మాట్లాడుతూ అకాల వర్షాలకు ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలకు 729 ఇళ్లకు పాక్షిక నష్టం
Published Wed, Oct 5 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement