thoguta
-
బీఆర్ఎస్ లీడర్, గాయకుడు కాన్గల్ శ్రీనివాస్‌గౌడ్ మృతి
సిద్దిపేటఅర్బన్/తొగుట: బైక్‌పై నుంచి పడి బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందాడు. సిద్దిపేట అర్బన్ మండలం కిష్టసాగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. తొగుట మండలం కాన్గల్ గ్రామానికి చెందిన మరు పల్లి శ్రీనివాస్ గౌడ్(43) మూడు రోజుల క్రితం బండిపై నుంచి పడడంతో తలకు తీవ్రగా యాల య్యాయి. కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఆస్ప త్రి నుంచి డిస్చార్జి అయిన తర్వాత పొన్నా లలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా కిష్టసాగర్ రోడ్డులో స్పృహ తప్పి పడిపోయాడు. వడదెబ్బ తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాన్గల్‌లో విషాదం ఉద్యమపాటలతో తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన గాయకుడు కాన్గల్ శ్రీనివాస్‌గౌడ్ మృతితో విషాదం అలుముకుంది. కాన్గల్ గ్రామానికి చెందిన మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్ టీడీపీలో క్రీయాశీల కార్యకర్తగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్లో చేరారు. దొమ్మాట ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మీటింగ్‌ను అడ్డుకొని వార్తల్లోకెక్కారు. వార్డు మెంబర్‌గా, విద్యా కమిటీ చైర్మన్‌గా, ఏఎంసీ డైరెక్టర్‌గా, పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా.. శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. -
వివాహేతర సంబంధం.. ఎలుకల మందు తాగిన భార్య
సాక్షి, తొగుట(దుబ్బాక): అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తొగుట ఎస్ఐ సామ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మన్నె భాస్కర్‌కు సిద్దిపేట మండలంలోని రంగధాంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (21)తో ఏడాది క్రితం వివాహమైంది. భాస్కర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. తరచూ ఆ మహిళతో సెల్ఫోన్లో మాట్లాడేవాడు. తల్లి అండవ్వతో కలిసి వేధించేవాడు. వారి వేధింపులు భరించలేక ఆదివారం ఇంటిలో ఎలుకల మందు తీసుకొంది. చికిత్స కోసం ఆమెను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఐరేని నర్సయ్య ఫిర్యాదు మేరకు భాస్కర్, అండవ్వపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి..) -
ఆ కాలేజ్ మెరిట్ స్కాలర్‌షిప్‌లకు అడ్డా..
సాక్షి, తొగుట(దుబ్బాక): తొగుట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికకు విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కళాశాల అధ్యాపకులు కృషి చేస్తున్నారు. చదువులతో పాటు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో విద్యార్థులు రాణిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. కళాశాల నుంచి ఏటా ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు ప్రతి ఏటా ఎనిమిది మంది చొప్పున విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ చదివేందుకు ఐదు సంవత్సరాలకు సుమారు రూ.70 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యార్థులకు విద్యాబోదన అందిస్తున్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు మెలకువలు నేర్పిస్తున్నారు. 2009లో కళాశాల స్థాపన తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009లో జూనియర్ కళాశాల ఏర్పాటైంది. గ్రీమీణ ప్రాంతాల పేద విద్యార్దులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కళాశాల ఏర్పాటుకు కృషిచేశారు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కళాశాలను ప్రారంభించారు. కళాశాల ఏర్పాటైన రెండో సంవత్సరంలోనే 200 మంది విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్యకు కళాశాల సరిపోలేదు. దీంతో ముత్యంరెడ్డి తన సొంత భవనాన్ని కళాశాలకు అందజేశారు. అందులో చాలా కాలం పాటు విద్య కొనసాగింది. తర్వాత ఆరంపురంలో కళాశాలకు సొంత భవనం నిర్మించి అందజేశారు. దీంతో కళాశాలకు విశాలమైన భవనం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారంటే విద్యా బోధన ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల ప్రోత్సాహం కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యాబోధనతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో ఎంపికవుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ విద్యతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేలా బోధిస్తున్నాం. ఇప్పటివరకు కళాశాల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇక్కడి విద్యార్థులు ప్రతి ఏటా ఎంపికవుతున్నారు. బోధనలో అధ్యాపకుల కృషి అభినందనీయం. – పరమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాంపురం ప్రత్యేక తరగతులు ఇంటర్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అధ్యాపకకులు బోధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి తర్ఫీదునిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు కళాశాల నుంచి ఎంపికవుతున్నారు. అధ్యాపకుల సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. – చిప్ప నవీన, కళాశాల పూర్వ విద్యార్థిని -
భారీ వర్షాలకు 729 ఇళ్లకు పాక్షిక నష్టం
తొగుట: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 729 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఎంపీడీఓ రాజిరెడ్డి తెలిపారు. బండారుపల్లిలో 31, ఎల్.బంజేరుపల్లిలో 27, బ్రాహ్మణ బంజేరుపల్లి 11, చందాపూర్ 19, ఏటిగడ్డకిష్టాపూర్ 73, ఘనపూర్ 60, గోవర్దనగిరి 21, గుడికందుల 25, కాన్గల్ 36, లక్ష్మాపూర్ 46, లింగంపేట 27, లింగాపూర్ 23, పల్లెపహాడ్ 46, పెద్దమాసాన్‌పల్లి 40, రాంపూర్ 7, తొగుట 51, తుక్కాపూర్ 44, వరదరాజుపల్లి 20, వేములఘాట్ 42, వెంకట్రావ్పేట 21, ఎల్లారెడ్డిపేట47, జప్తిలింగారెడ్డిపల్లిలో 12 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల బాధితులు మాట్లాడుతూ అకాల వర్షాలకు ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
సీనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
అల్వాల్: ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ జరిగింది. ఎస్ఐ మధుసూదరెడ్డి కథనం ప్రకారం... ఓల్డ్ అల్వాల్ వాసవినగర్ నివాసి జి.భాస్కర్‌రెడ్డి (53) తొగుట ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్. భార్య పుష్ప, ఇద్దరు పిల్లలున్నారు. భార్య సిద్దిపేటకు వెళ్లి శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి భాస్కర్‌రెడ్డి బెడ్రూంలోని ఉరేసుకొన్నాడు. ఇతని బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేశారు!
మూలపడిన ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు తొగుట: రైతులు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం శుభ్రపరించేందుకు యంత్రాలను లక్షలు వెచ్చించి కొన్నారు... అధికారుల నిర్లక్షంతో మూలకు పడేశారు. దీంతో ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు వానకు నాని, ఎండకు ఎండి తుప్పుపడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండలంలోని వివిద గ్రామాలలో మహిళా సంఘాల ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం శుభ్రపరిచేందుకు స్థానిక వ్యవసాయ మార్కేట్ నుంచి వీటిని తీసుకు పోయారు. కొనుగోలు ముగియగానే వాటిని మార్కెట్‌కు అప్పగించాల్సి ఉండగా, ఆయా కొనుగోలు కేంద్రాలు ముగియగానే వాటిని అక్కడే మూలకు పడేశారు. దీంతో నిర్వాహకులు దాని అవసరం తీరాక అక్కడే వదిలేసి పోవడంతో లక్షలు విలువైన యంత్రాలు పాడైపోతున్నాయి. సుమారు పదేండ్ల క్రితం తొగుట వ్వయసాయ మార్కేట్ కమిటీ అదికారులు 27 యంత్రాలను కొనుగోలు చేశారు. అందులో 12 యంత్రాలను మండలంలోని పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి, ఘణపురం, కాన్గల్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లేపహడ్, వెంకట్రావుపేట, లింగాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, లింగంపేట గ్రామల ఐకేపీ సంఘాలకు అప్పగించారు. దీంతో ఆయా గ్రామాల్లోని ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు మూలకే పడ్డాయి. మళ్లీ సీజన్ ప్రారంభం అయినప్పుడే వాటి విలువ అధికారులకు తెలిసివస్తుంది! అప్పుడు అధికారులు వాటి రిపేర్ల పేరుతో డబ్బులు వెచ్చిస్తారు. తప్పా వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేకపోవడం సోచనీయం. -
దూరమైన మాతృత్వం
పాలిస్తూ మృత్యు ఒడికి చేరిన తల్లి గుక్కపట్టి ఏడుస్తోన్న పసికందు తొగుట: నిండు బాలింత.. నెలలు నిండని పసికందు.. విధి వక్రీకరించింది. వీరి బంధాన్ని వేరు చేసింది. తల్లి పాలే ఆ పసికందుకు దూరమయ్యాయి. పుట్టిన బిడ్డకు పాలిస్తూ ఆ తల్లి మృత్యు ఒడిలోకి ఒరిగిపోయింది. పాలను తాగుతున్న లోకం తెలియని ఆ పసికందుకు ఇక అమ్మలేదన్న విషయం తెలియదు. ఆ పసికందును చూసిన కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదించారు. పలువురిని కంట తడి పెట్టించిన ఈ విషాదకర సంఘటన తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తుక్కాపూర్ గ్రామ శివారులోని తుర్రకాశవాడకు చెందిన షేక్ సమీనా (20) మూడు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తల్లిగారింటి వద్దే ఉంటోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి పనులు పూర్తి చేసుకుని తన మూడు నెలల కూతురుకు పాలిస్తూ పడుకుంది. ఈ క్రమంలో ఆమె అలాగే మృత్యు ఒడిలోకి చేరింది. సాయంత్రం పసిపాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుండడంతో పక్కింటివారు వచ్చి చూశారు. వారు సమీనాను నిద్రలేపే ప్రయత్నం చేయగా, ఆమె నిద్రలేవ లేదు. దీంతో సమీపంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన డాక్టర్ సమీనాఅప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. అక్కడ ఉన్న పసికందును చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఢిల్లీలో ఎంపీటీసీల ధర్నా
తొగుట: గ్రామాలాభివృద్ధిలో ఎంపీటీసీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంపీటీసీ సభ్యుల ఫోరం ఆధ్యర్వంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మండలం నుంచి ఎంపీటీసీ సభ్యులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంటి యాదగిరి ధర్నా విషయాలను ఢిల్లీ నుంచి స్థానిక విలేకరులకు వివరించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఎంపీటీసీ సభ్యులకు గ్రామ పంచాయతీ తరహాలో అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఎంపీటీసీ సభ్యులు పిట్ల సత్తయ్య, ఎల్లం తదితరులు ఉన్నారు. -
అధికారులవల్లే ప్రభుత్వ పథకాలు విఫలం
తొగుట,న్యూస్‌లైన్: ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇందిరమ్మ పచ్చతోరణం కింద చెట్టూ పట్టా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్ష్యం నెరవేరకుండా పోతోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి పథకం నిర్వహణ ప్రత్యేక కమిషనర్ సైదులు దృష్టికి తీసుకవచ్చారు. మండలంలోని తుక్కాపూర్ కాశితుర్క కాలనీలో, ఎల్లారెడ్డిపేటలో పథకంలో చేపట్టిన పనులను సోమవారం కమిషనర్ సైదులుతో కలిసి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించడానికి కనీసం రెండు నెలలకు ఒకసారైనా ఏపీడీ ఏగొండస్వామి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఏపీఓ శైలజ తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సకాలంలో చెల్లించక పోవడంతో గ్రామాల్లో చాలా మంది ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోడ్లవెంట మొక్కలు నాటే పథకానికి సీఎం కిరణ్‌తో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు. ఫలితంగా కాలుష్య నివారణతో పాటు, ప్రయాణికులకు అహ్లాదకరమైన వాతావరణం అందించటంతోపాటు వలసల నివారణకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాటిన మొక్కల్లో సగం కూడా దక్కకుండా పోతున్నాయన్నారు. ప్రత్యేక కమిషనర్ సైదులు మాట్లాడుతూ ఇందిరమ్మ పచ్చతోరణం పథక నిర్వహణ విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించే అధికారులు ఎంతటి హోదాలో ఉన్న ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. వారం రోజుల్లో మండలంలో మళ్లీ పర్యటిస్తానని ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఈజీఎస్ అధికారులను హెచ్చరించారు. పర్యావరణ పరిశుభ్రత కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ముందుగా సొంత డబ్బులు ఖర్చు చేసి నిర్మాణాలు చేయిస్తున్న తుక్కాపూర్ సర్పంచ్ చెరుకు విజయ్‌రెడ్డిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, తహశీల్దార్ నజీబ్ అహ్మద్, సీఐ అశోక్‌బాబు, సర్పంచ్ బుర్ర అనితా నర్సింలుగౌడ్, డీసీసీ కార్యదర్శి గాంధారి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘చెట్టు పట్టా’ అమలులో జిల్లా వెనుకంజ మిరుదొడ్డి: చెట్టు పట్టా కార్యక్రమం అమలులో దుబ్బాక నియోజక వర్గం వెనుకంజలో ఉందని ఇందిరమ్మ పచ్చతోరణం జిల్లా జాయింట్ కమిషనర్ సైదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాలలో సోమవారం చెట్టు పట్టా కార్యక్రమాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మిరుదొడ్డి ఎంపీడీఓ కార్యలయంలో ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్టు పట్టా కార్యక్రమం విజయవంతం కావడానికి ఈజీఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. పథకంపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మొక్కలను ఈజీఎస్ ద్వారా పంపిణీ చేశామన్నారు. చెట్టు పట్టా కార్యక్రమంలో పని చేసిన కూలీలకు 3 నెలలుగా డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం ఎందుకని ఏపీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. నియోజక వర్గంలో చెట్టు పట్టా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ చెట్టు పట్టా పథకం ద్వారా పర్యావరణంతో పాటు బడగు బలహీన వార్గాలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ కొంగరి రాజయ్య, మిరుదొడ్డి ఏఎంసీ చైర్మన్ నేరండ్ల భూమాగౌడ్, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.