విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలో మంగళవారం మళ్లీ పలు చోట్ల వర్షం పడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయినాయి. అనకాపల్లి బస్టాండ్ ఇంకా వరద నీటిలోనే చిక్కుకుని ఉంది. ఎలమంచిలిలో ఇంకా 1500 ఇళ్లు నీటిముంపులనే ఉన్నాయి. నారాయణపురం కాజ్వేపై వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా వారంరోజుల్లో 10 మంది మృతి చెందారు.