జనసాగరంగా ఉరుకుంద
– భారీగా తరలివస్తున్న భక్తజనం
– చివరి సోమవారం పూజలకు క్యూకడుతున్న వైనం
కౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా చివరి సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో ఉరుకుంద క్షేత్రం ఆదివారం ఉదయం నుంచే జన సాగరాన్ని తలపించింది. ఆదివారం సాయంత్రం నుంచి క్యూలైన్లలో భక్తుల రద్దీ కనిపించింది. సోమవారం తెల్లవారుజామున స్వామి వారి పల్లకి తుంగభద్ర నదికి బయలు దేరి సాయంత్రం తిరిగి ఉరుకుందకు చేరుకుంటుందని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఈఓ మల్లికార్జున ప్రసాద్‌తెలిపారు.æ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్ ఆధ్వర్యంలో కౌతాళం ఎస్‌ఐ నల్లప్ప బందోబస్తు ఏర్పాట్లు చేశారు.