చెరువులను నింపాలని దీక్ష | hesitation for Filling water in ponds | Sakshi
Sakshi News home page

చెరువులను నింపాలని దీక్ష

Published Sun, Aug 28 2016 7:54 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

చెరువులను  నింపాలని దీక్ష - Sakshi

చెరువులను నింపాలని దీక్ష

చిలుకూరు: ప్రస్తుతం విడుదల చేసిన సాగర్‌ నీటితో మండలంలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం తదితర చెరువులను తక్షణమే నింపాలని కోరుతూ శక్తి యూత్, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రామాపురం వద్ద గల ఆర్‌కే మేజర్‌ కాలువలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని కోరారు . ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోయి మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని అన్నారు. చెరువులను నింపకపోతే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి యూత్‌ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్, నాయకులు అలసకాని జనార్ధన్, కొల్లు సత్యనారాయన, పట్టా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement