చెరకుతోట దహనం’పై వివరాలివ్వండి | High Court order to the Guntur police | Sakshi
Sakshi News home page

చెరకుతోట దహనం’పై వివరాలివ్వండి

Published Thu, Nov 5 2015 3:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

High Court order to the Guntur police

గుంటూరు పోలీసులకు హైకోర్టు ఆదేశం

 సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం, మల్కాపురంలో చెరకుతోట దహనమైన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమముందు ఉంచాలని గుంటూరు జిల్లా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయమై తన కుమారుడు నూతక్కి సురేశ్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆచూకీ తెలపడం లేదని తండ్రి  రాములు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ధర్మాసనం విచారణ చేసి పూర్తి వివరాలు అందజేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement