మరో నాలుగు రోజులు వడగాడ్పులు | high temperatures in two telugu states | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు వడగాడ్పులు

Published Sat, Apr 16 2016 4:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

high temperatures in two telugu states

సాక్షి, విశాఖపట్నం:  కొద్ది రోజులుగా వడగాడ్పులతో అల్లాడిపోతున్న తెలంగాణ, రాయలసీమకు ఏమాత్రం ఉపశమనం లభించడంలేదు. రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా వడగాడ్పులు వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది.

ఐఎండీ వాతావరణ నమోదు కేంద్రాల్లో రికార్డయిన ఉష్ణోగ్రతల ప్రకారం..  శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోకెల్లా నిజామాబాద్‌లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు, అనంతపురంలలో 44, రామగుండం, రెంటచింతలలో 43, హైదరాబాద్, నందిగామలలో 41, తిరుపతిలో 40, నెల్లూరు, తుని, గన్నవరంలలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement