రాష్ట్రస్థాయి పోటీలకు ఎంజీఎం విద్యార్థులు | hindupur students to state level foot ball league | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంజీఎం విద్యార్థులు

Published Tue, Sep 20 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంజీఎం విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంజీఎం విద్యార్థులు

హిందూపురం టౌన్‌ : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు అండర్‌–14, 17 బాలబాలికల విభాగంలో ఎంజీఎం పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు జీవరత్న పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎంపికైన విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈ నెల 17న జిల్లా కేంద్రంలో ఏపీ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 14, అండర్‌ 17 ఎంపికలు జరిగాయి. అందులో ఎంజీఎం పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అండర్‌ 14 బాలికల విభాగంలో 8వ తరగతికి చెందిన జీసీ హర్షిత, డి.విజయవాణి, ఎస్‌.మనీషా, బాలుర విభాగంలో ఎం.మంజునాథ్, ఎండీ ఆరీఫ్‌ ఎంపికయ్యారన్నారు. అండర్‌ 17 బాలికల విభాగంలో డి.సిమ్రాన్‌ (10వ తరగతి) ఎ.నిఖిత (9వ తరగతి), బాలుర విభాగంలో ఇ.సాయికిరణŠ  (10వ తరగతి) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యార ని జీవరత్న తెలిపారు. వీరు అక్టోబరులో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

Advertisement

పోల్

Advertisement