Published
Sat, Aug 20 2016 10:35 PM
| Last Updated on Sat, Jul 6 2019 12:47 PM
కొనసాగుతున్న బ్రహ్మయజ్ఞం
పాల్గొన్న మంత్రి కామినేని
చినాకాకాని (మంగళగిరి): మండలంలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి ఆవరణలో పుష్కరాల సందర్భంగా జరుగుతున్న నవాహ్మిక పంచకుండాత్మిక బ్రహ్మయజ్ఞం కొనసాగుతుంది.ఇందులో భాగంగా శ్రీత్రిదిండి చిన్నజీయర్ స్వామి శనివారం భక్తులకు ప్రవచనాలను వివరించి తీర్ధప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బ్రహ్మయజ్ఞంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.అదే విధంగా ఎన్‌ఆర్‌ఐ చైర్మన్ ముక్కామల అప్పారావు కుటుంబసమేతంగా హాజరై బ్రహ్మయజ్ఞంలో పాల్గొన్నారు.ఆసుపత్రి యాజమాన్యంతో పాటు డాక్టర్లు సిబ్బంది యజ్ఞంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.