China kakani
-
ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం
సాక్షి, గుంటూరు: ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు చిన్న కాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కాజా టోల్గేట్ దగ్గర ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. భద్రతా సిబ్బందిపై సైతం దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి సంయమనం పాటించి.. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వెనుక నుంచి దాడి చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుకు పిన్నెల్లి సవాల్ తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికపంద చర్యగా అభివర్ణించారు. రైతుల ముసుగులో చంద్రబాబు తన కార్యకర్తలతో దాడి చేయించారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే తనపై, గన్మెన్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పేరిట చంద్రబాబు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే చంద్రబాబు ధైర్యంగా ముందుకు రావాలని సవాల్ విసిరారు. అదే విధంగా రాజధాని ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా న్యాయం చేస్తారని పిన్నెల్లి స్పష్టం చేశారు. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు ముసుగులో దాడులకు పాల్పడితే తాము భయపడమని స్పష్టం చేశారు. -
‘లింగమనేని’కి భూ విందు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా, నిడమర్రు, చినకాకాని.. పెదకాకాని మండలం నంబూరు.. తాడికొండ మండలం కంతేరు గ్రామాల మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఉన్న డొంక రోడ్డును విజయవాడకు చెందిన లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ అప్పనంగా కొట్టేసింది. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ రహదారిని మూసివేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏసీసీ యాజమాన్యం కింద విలువైన భూములు ఉండేవి. 2004 సంవత్సరానికి ముందే ఈ భూములు తొలుత ప్రభుత్వానికి చెందిన ‘ఉడా’కు, తర్వాత లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ పరమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వివిధ సర్వే నంబర్లలో 146.68 ఎకరాల భూములుండగా, వాటిలో 115.91 ఎకరాలను ‘ఉడా’ కొనుగోలు చేసి, లింగమనేని సంస్థకు విక్రయించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా డొంకదారిని కూడా విక్రయించడం గమనార్హం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 143 సర్వే నంబర్లో దాదాపు కిలోమీటర్ పొడవున, 40 అడుగుల వెడల్పుతో ఈ రహదారి ఉంది. కంతేరు, నంబూరు గ్రామాల పొలిమేరల్లో ఉన్న ఈ డొంకరోడ్డును గతంలో రైతులు ఉపయోగించుకునేవారు. ఈ డొంకరోడ్డు విస్తీర్ణం 2.15 ఎకరాలు కాగా, 2004కు ముందు ఉడా అధికారులు లింగమనేని రియల్ ఎస్టేట్‌కు కేవలం రూ.15 లక్షలకే విక్రయించారు. లింగమనేని సంస్థ కొనుగోలు చేసిన 115.61 ఎకరాలతోపాటు 2.15 ఎకరాల డొంకరోడ్డు భూమిలో లేఔట్ వేసేందుకు ఉడా అనుమతులు ఇచ్చేసింది. దాంతో డొంక రోడ్డు చుట్టూ లింగమనేని కంపెనీ ప్రహరీ నిర్మించింది. ‘ఉడా’ ఎంతో ఉదారంగా రూ.15 లక్షలకు విక్రయించిన 2.15 ఎకరాల భూమి విలువ ఇప్పుడు అక్షరాలా రూ.30 కోట్లకు చేరడం గమనార్హం. డొంక దారి విక్రయంపై స్థానికులు కోర్టుకు వెళ్లడంతో పాటు లోకాయుక్తను సైతం ఆశ్రయించారు. డొంకదారి విక్రయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ రహదారిని లింగమనేని చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాలికపై లైంగిక దాడి
చినకాకాని (మంగళగిరి టౌన్): మంగళగిరి మండల పరిధి చినకాకానిలో బాలికపై లైండిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి గ్రామంలో నివాసం ఉంటున్న షేక్ హనీఫ్ సమీపంలో దుకాణం వద్దకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు గదిలోనే నిర్బంధించాడు. ఎంతకూ బాలిక ఇంటికి రాకపోవడంతో బాబాయి చంద్రశేఖర్ ఊరంతా గాలించి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే హనీఫ్ వదిలేయడంతో బాలిక భోరున విలపిస్తూ బాబాయికి విషయం చెప్పింది. అప్పటికే 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో స్థానిక పోలీసులు విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు హనీఫ్‌ను అదుపులోకి తీసుకుని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగక దాడి కేసులు నమోదు చేశారు. హనీఫ్‌కు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణాయపాలెంలో ఓ క్రేన్ యజమాని వద్ద ఆపరేటర్‌గా పనిచేస్తూ చినకాకానిలో నివాసం ఉంటున్నాడు. -
కొనసాగుతున్న బ్రహ్మయజ్ఞం
పాల్గొన్న మంత్రి కామినేని చినాకాకాని (మంగళగిరి): మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఆవరణలో పుష్కరాల సందర్భంగా జరుగుతున్న నవాహ్మిక పంచకుండాత్మిక బ్రహ్మయజ్ఞం కొనసాగుతుంది.ఇందులో భాగంగా శ్రీత్రిదిండి చిన్నజీయర్ స్వామి శనివారం భక్తులకు ప్రవచనాలను వివరించి తీర్ధప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బ్రహ్మయజ్ఞంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.అదే విధంగా ఎన్ఆర్ఐ చైర్మన్ ముక్కామల అప్పారావు కుటుంబసమేతంగా హాజరై బ్రహ్మయజ్ఞంలో పాల్గొన్నారు.ఆసుపత్రి యాజమాన్యంతో పాటు డాక్టర్లు సిబ్బంది యజ్ఞంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.