
ప్రతీకాత్మక చిత్రం
చినకాకాని (మంగళగిరి టౌన్): మంగళగిరి మండల పరిధి చినకాకానిలో బాలికపై లైండిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి గ్రామంలో నివాసం ఉంటున్న షేక్ హనీఫ్ సమీపంలో దుకాణం వద్దకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు గదిలోనే నిర్బంధించాడు. ఎంతకూ బాలిక ఇంటికి రాకపోవడంతో బాబాయి చంద్రశేఖర్ ఊరంతా గాలించి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంతలోనే హనీఫ్ వదిలేయడంతో బాలిక భోరున విలపిస్తూ బాబాయికి విషయం చెప్పింది. అప్పటికే 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో స్థానిక పోలీసులు విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు హనీఫ్‌ను అదుపులోకి తీసుకుని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగక దాడి కేసులు నమోదు చేశారు. హనీఫ్‌కు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణాయపాలెంలో ఓ క్రేన్ యజమాని వద్ద ఆపరేటర్‌గా పనిచేస్తూ చినకాకానిలో నివాసం ఉంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment