
మేనకోడలిపై వేధింపులు: రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
గుంటూరు: మేనకోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు గుంటూరు జిల్లా మంగళగిరిలో కటకటాలపాలయ్యాడు. దాసు అనే రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్ సొంత చెల్లెలి కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె దాసును నిలదీసింది. ఆమెపై దాసు దాడికి పాల్పల్డాడు.
దౌర్జన్యానికి దిగిన దాసుకు మహిళా సంఘాల నాయకులు, స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాసు వేధింపులు భరించలేక అతడి మొదటి భార్య, తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని కలిసి పుట్టింకి వెళ్లిపోయింది. భాగ్యం అనే మరో కలిసి అతడు సహజీవనం సాగిస్తున్నాడు.