యువతిపై లైంగిక దాడి | Sexual assault on Young woman ar Prakasam district | Sakshi
Sakshi News home page

యువతిపై లైంగిక దాడి

Published Tue, Nov 7 2017 12:20 PM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

Sexual assault on Young woman ar Prakasam district - Sakshi

మద్దిపాడు: ఓ జంట సరదాగా మల్లవరం సమీపంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్దకు వెళ్లింది. ముగ్గురు యువకులు జంటను వెంబడించి యువతితో ఉన్న యువకుడిని చితకబాదారు. అనంతరం ఆమెను చెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరగగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  వివరాలు.. ఒంగోలుకు చెందిన యువతి ఓ యువకుడితో కలిసి మల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయం వెనుక భాగంలో ఉన్న మామిడి తోట వైపునకు వెళ్లింది. ముగ్గురు యువకులు అక్కడికి వెళ్లి యువకుడిని చితకబాదారు. మహిళను సమీపంలోని తోటలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

కేకలు పెట్టిన బాధితడు
దుండగుల చేతిలో దెబ్బలు తిన్న యువకుడు చిన్నగా జాతీయ రహదారిపైకి వచ్చాడు. మల్లవరం గ్రామానికి చెందిన కొందరు యువకులు వచ్చి అందరూ కలిసి యువతి ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు. సుమారు గంట తర్వాత బాధిత యువతి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. జరిగిన ఘోరాన్ని తలుచుకుని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆమెతో వచ్చిన యువకుడు కొలచనకోట వాసిగా తెలుస్తోంది.

వెలుగులోకి రాని మరెన్నో ఘటనలు
ఇలాంటి ఘటనలు మల్లవరం సమీపంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ప్రాంతాల్లో ఎన్నో జరిగాయి. బాధితులు పరువు ప్రతిష్టలకు వెళ్లి ఫిర్యాదులు చేయకపోవడంతో లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి రావడం లేదు. గత నెలలో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న జంటను బెదిరించి వారి డబ్బులు లాక్కుని దుండగులు పారిపోయారు. రోజూ ఇక్కడకు ఒంగోలు నుంచి జంటలు వస్తుంటాయి. చీకటి పడే వరకూ రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లో ఉండి వెళ్తుంటారు. ముఖ్యంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు రిజర్వాయర్‌ ప్రాంతానికి తరుచూ వస్తున్నారు. వీరి కోసమే కొందరు దుండగులు అక్కడ కాపుగాసి దాడులతో పాటు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సహజంగా అక్కడికి వచ్చే జంటలు ఏకాంతంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని వెళ్తుంటాయి. అఘాయిత్యాలు జరిగినా బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు కావడంతో ఇంటి వద్ద తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మిన్నకుండిపోతున్నారు. వివాహేతర సంబంధాలు ఉన్న వారు కూడా ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా అన్నంగి కొండవాలు, దేవాలయం వెనుక భాగంలోని మామిడి తోట, పెయ్యల తిప్ప పరిసర ప్రాంతాల్లో చీకటి పడితే జన సంచారం ఉండదు. దుండగులు ఆయా ప్రాంతాల్లో మాటు వేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

మానసిక స్థితి సరిలేని యువతిపై కూడా..
త్రిపురాంతకం: మానసిక స్థితి సరిగాలేని యువతిపై ఆమె సమీప బంధువైన యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్‌ఐ త్యాగరాజు సోమవారం తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. త్రిపురాంతకం ఎన్‌ఎస్‌పీ కాలనీకి చెందిన షేక్‌ నాసర్‌వలి తన దగ్గర బంధువైన యువతిపై కన్నేశాడు. అదును చూసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్యాగరాజు తెలిపారు. బాధితురాలికి సుమారు 18 ఏళ్లు ఉండగా నిందితుడికి 30 ఏళ్లు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement