శివారు ప్రాంతాల్లో అడ్డా
యువతులపై అఘాయిత్యాలు
నియంత్రించలేకపోతున్న పోలీసులు
ఫిర్యాదు చేయడానికి జంకుతున్న బాధితులు
కరీంనగర్ క్రైం : నగరంలో చిల్లర గ్యాంగ్ రెచ్చిపోతోంది. శివారు ప్రాంతాల్లో అడ్డావేసి ఒంటరిగా, జంటగా వెళ్లే యువతులు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాయి. ధన, మానా లు దోచుకునేందుకు, చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని ఈ గ్యాంగ్‌లను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గ్యాంగ్‌ల ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నారు. నగరంలోని 2009 నుంచి చిల్లర గ్యాంగ్ కల్చర్ మొదలైంది. మానేరు డ్యాం, పరిసరాల్లోని పార్కులకు వస్తున్న ఒంటరి మహిళలు, జంటలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపొవడంతో వారి ఆగడాలు హద్దుమీరుతున్నాయి. మహిళలు, యువతులపై అఘాయిత్యాలతోపాటు ఓ పార్టీ అండదండలతో భూకబ్జాలు, పోలీసులపై దాడులు చేసేవరకు ఎదిగారు. 2011లో వన్‌టౌన్ సీఐ సాయిమనోహర్ వీరి అగడాలకు బ్రేకులు వేశారు.
దీనిని జీర్జించుకోని ఓ వర్గం పనికట్టుకుని సదరు సీఐ బదిలీ చేయించారని ప్రచారంలో ఉంది. సీఐ బదిలీ కావడంతో మళ్లీ ఈ గ్యాంగ్ ఆగడాలు ఊపందుకున్నాయి. ఎంతోమంది మహిళపై అఘాత్యాలు చేసినా బాధితుల నుంచి ఫిర్యాదులు మాత్రం పోలీసులకు అందడంలేదు. 2012లో ఓ వ్యక్తిపై దాడిచేసిన కేసులో వీరిని రిమాండ్ చేశారని సమాచారం. ఈ గ్యాంగుల సమాచారం పోలీసుల వద్ద ఉన్నా కేసులు విషయం వచ్చే సరికి నీళ్లు నలుముతున్నారు. గ్యాంగ్ కల్చర్ హద్దుమీరుతున్నా రాజకీయ స్వప్రయోజనాల కోసం నాయకులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మానేరు డ్యాం నుంచి మకాం మార్చిన ఈ గ్యాంగ్ కొంతకాలంగా నగర శివారు ప్రాం తాల్లో అడ్డాలు వేసి మహిళలు, యువతులను టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది. సమాచారం సేకరణలో ముందుంటామని పేర్కొనే పోలీస్‌శాఖ ఈ గ్యాంగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదు వస్తేనే స్పందిస్తామని గ్యాంగ్ సమాచారం సేకరించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోసారి వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ నాలుగు రోజుల క్రితం తన బంధువుతో బైక్‌పై నగరానికి వస్తున్న ఓ బాలికతో ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడిచేశారు. మరో నలుగురు వీరికి సహకరించారు. అనంతరం ఈ విషయంలో ఆరుగురి మద్య గొడవ జరుగడంతో గ్యాంగ్‌లోని ఐదుగురు కలిసి దూం ఖలీద్‌ను చితకబాదినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన ఖలీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బాలికపై లైంగికదాడి విషయం బయటకు రావడంతో గ్యాంగ్ సభ్యులు ఓ పార్టీ నాయకుడితో కేసులు కాకుండా బాలిక బంధువులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే రంగంలోకి దిగిన ఓ వర్గం నాయకులు కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం గ్యాంగ్‌లోని ముగ్గురు పరారీలో ఉండగా, మరో ఇద్దరు దర్జాగా తిరుగుతున్నట్లు తెలి సింది. నగరం శివారు ప్రాంతాల్లో నివాసం ఉం డే ఎవరిని అడిగినా ఈ గ్యాంగ్ ఆగడాల గురిం చి కథలు కథలుగా చెబుతారు. కానీ, పోలీ సులు వద్ద చిన్న సమాచారం కూడా ఉండదు. చివరకు ఈ గ్యాంగ్ సభ్యుల ఫొటోలు కూడా సంపాందించలేని పరిస్థితుల్లో మన పోలీసులు ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు గ్యాంగ్ సభ్యులు పోలీసుల వాచ్‌లిస్టు, అనుమానితులు లిస్టులో కూడా లేరని తెలిసింది. ధూం ఖలీద్‌పై మాత్రం అలవాటు పడ్డ నేరగాడు(డోసర్ క్రిమినల్, డీసీసీ) రికార్డు మెయింటెన్ చేస్తున్నారని సమాచారం.
విచారణకు అదేశించిన పోలీస్ బాస్
నగరంలో శివారులో ఓ బాలికపై లైంగికదాడి సంఘటన బయటకు పొక్కడంతో విచారణ చేపట్టి వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జోయల్ డేవిజ్ పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. కొంతకాలంగా ఈ గ్యాంగ్ ఆగడాల వివరాలు తెలుసుకున్న ఎస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు గ్యాంగ్ సభ్యులను పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది.