హోం డెలివరీ | Home delivery | Sakshi
Sakshi News home page

హోం డెలివరీ

Published Mon, Aug 29 2016 7:08 PM | Last Updated on Fri, Jul 27 2018 1:22 PM

హోం డెలివరీ - Sakshi

హోం డెలివరీ

  • ఫోన్, వాట్సప్, ఆన్‌లైన్‌లో బుకింగ్‌
  • ఎన్‌ఐటీ స్టూడెంట్‌ స్టార్టప్‌
  • హోం డెలివరీతో వ్యాపారం విస్తృతం
  • వాట్సఫ్‌ నంబర్‌ 08786508080
  • కరీంనగర్‌ బిజినెస్‌ : కరీంనగర్‌లోని వావిలాలపల్లికి చెందిన మొలుగూరి ప్రణయ్‌ చెన్నైలోని త్రిచీ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) లో ఎంసీఏ పూర్తి చేశారు. ఆన్‌లైన్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. తన క్లాస్‌మెట్‌ హర్యానాకు చెందిన స్వాతితో కలిసి స్టార్ట్‌ చేశారు. బైనారిక్స్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థను ప్రారంభించారు.  ఇతని తండ్రి నారాయణ ఎయిర్‌పోర్స్‌లో ఉద్యోగం చేసి ఉద్యోగవిరమణ పొందారు. మెట్రోనగరాలకే పరిమితమైన ఇలాంటి వ్యాపారం కరీంనగర్‌లో ప్రవేశపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 
    వ్యాపారానికి బీజం ఇలా 
    ఎంసీఏలో ఇంటర్న్‌షిప్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో శిక్షణ పొందుతుండగా వచ్చిన ఆలోచనే ఈ వ్యాపారానికి భీజం వేసింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకుసాగుతున్నారు. నగరంలోని వివిధ హోటళ్లు, బేకరీలు, మాల్స్‌తో టైఅప్‌ అయ్యి మనకు ఏ వస్తువు కావాలంటే దానిని హోం డెలివరీ చేస్తున్నారు. 
    ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు
    వినియోగదారులకు కావాల్సిన వస్తువులను తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తూ అవి ఉన్న సంస్థలు, దుకాణాలు, బేకరీలతోపాటు ఇతర వాణిజ్య సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. కావాల్సిన వస్తువులను సంస్థలకు వెళ్లి తీసుకొని వినియోగదారులకు అందిస్తుంటారు. ఇతని వ్యాపార వ్యూహం నచ్చిన అమెరికా, సింగపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, న్యూఢిల్లీ వాసి ఇందులో పెట్టుబడులు పెట్టినట్లు ప్రణయ్‌ తెలిపారు.  
    3 వేలకు పైగా ఐటమ్స్‌
    దాదాపు మూడు వేలకు పైగా వస్తువులను వినియోగదారులకు డెలివరీ అందిస్తున్నారు. ఇందులో పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పప్పులు, నూనె, కోడిగుడ్లు, చికెన్, మటన్, మసాలాలు, బిర్యానీలు, మిఠాయిలు, పిజ్జా, బర్గర్, టిఫిన్స్, చాట్‌ ఐటమ్స్‌ కట్లీస్, పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్, కేక్‌లు, చాక్లెట్‌లు, బ్రెడ్‌లు వంటి బేకరీ ఐటమ్స్, టేస్టీఫుడ్‌లతోపాటు పలు రకాల మూడు వేలకు పైగా వస్తువులను డోర్‌ డెలివరీ చేస్తున్నారు. వినియోగదారులకు బర్త్‌డే, మ్యారేజీడేలతోపాటు పలు ప్రత్యేక రోజులలో ఆర్డర్‌పై సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌లు, కేక్‌లు, గ్రీటింగ్‌కార్డులతో ఇతర వస్తువులు సైతం అందిస్తున్నారు. 
     
    విద్యార్థులకు అండగా 
    ఎంసీఏ స్టూడెంట్‌ అవడంతో వెబ్‌సైట్‌ను స్వయంగా రూపొందించుకున్నారు. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌ విద్యార్థులతోపాటు ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన ఇంటర్న్‌షిప్‌ సైతం అందించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు.
     
    చార్జీలు ఇలా..
    కరీంనగర్‌ సిటీలో రూ.300 ఆర్టర్‌లోపు రూ.30 డెలివరీ చార్జీలు వసూలు చేస్తుండగా.. ఆపైనా ఉచితంగా అందిస్తున్నారు. 
    నగరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రూ.700 ఆర్టర్‌కు రూ.70 చార్జీలు వసూలు చేస్తుండగా.. ఆపైన ఉచితంగా అందిస్తున్నారు.  
     
    వ్యాపారాన్ని విస్తరిస్తాను
    – మొగులూరి ప్రణయ్, బైనారిక్స్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ 
    నేను ఎన్‌ఐటీలో ఎంసీఏ ఇంటర్న్‌షిప్‌ చేసేటప్పుడు మా స్నేహితులు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ సైడ్‌ వెళ్లారు. నాకు మాత్రం స్వశక్తితో ఎదిగి కొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగాను. కరీంనగర్‌లో ఇలాంటి మార్కెట్‌ అవసరమని భావించి ప్రారంభించాను. ఇంకా రాష్ట్రమంతా విస్తరించాలని ఉంది. వెబ్‌సైట్‌లో ఉన్న ఐటమ్స్‌ ఏదైనా 45 నిమిషాల్లో డెలివరీ ఇవ్వడం మా ప్రత్యేకత. చాలా మంది వినియోగించుకుంటున్నారు. 
    వినూత్న వ్యాపారం చేయాలని
    – స్వాతి, బైనారిక్స్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ 
    కరీంనగర్‌ మార్కెట్‌లో ఇలాంటి వ్యాపారాలు ఎక్కువగా లేవు. ప్రణయ్‌ నాకు ఎన్‌ఐటీ(త్రిచి–తమిళనాడు)లో క్లాస్‌మేట్‌. ప్రణయ్‌ నాకు కరీంనగర్‌ సిటి మార్కెట్‌ గురించి ప్రస్తావించేవాడు. వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుని ప్రణాళిక ప్రకారం ఇక్కడ స్టార్టప్‌ చేశాం. 
     
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement