నిజాయితీగా విధులు నిర్వర్తించాలి | honestly fulfil the duties | Sakshi
Sakshi News home page

నిజాయితీగా విధులు నిర్వర్తించాలి

Published Sun, Jul 31 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

మాట్లాడుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మాట్లాడుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  •  ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఎంపీ పొంగులేటి పిలుపు
  • పీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత మెటీరియల్‌ పంపిణీ
  • ఖమ్మం: శాంతి భద్రతలు కాపాడే అత్యున్నత ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు నిజాయితీగా విధులు నిర్వహించి జిల్లా పేరు ప్రఖ్యాతులను దేశ నలుమూలలా చాటాలని ఎస్సై, కానిస్టేబుల్‌ మెయిన్స్‌ అభ్యర్థులకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గత రెండు నెలలుగా ఎంపీ పొంగులేటి తన సొంత ఖర్చులతో జిల్లాలోని 200 మంది అభ్యర్థులకు శిక్షణనిస్తున్నారు. శనివారం బైపాస్‌రోడ్డులోని రామMýృష్ణ ఫంక్షన్‌హాలులో శిక్షణ శిబిర కేంద్రంలో అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు లింగాల కమల్‌రాజ్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ తనను ఒక సందర్భంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఫిజికల్‌ ఈవెంట్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు కొందరు కలిశారని, తాము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందే ఆర్థిక స్థోమతలేదని, గ్రౌండ్‌లో హైజంప్‌ ప్రాక్టీస్‌ చేయడానికి స్టాండ్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే వారి పరిస్థితిని గమనించి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పేద నిరుద్యోగులకు ఉచిత శిక్షణనిచ్చే మహాయజ్ఞాన్ని ప్రారంభించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అభినందించారు. జెడ్పీచైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ పాపాలాల్, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి మాట్లాడుతూ నేడు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అందరూ భవిష్యత్‌లో బాధ్యత గల పోలీసు అధికారులుగా విధులు నిర్వహించాలని అభిలషించారు.  అనంతరం అభ్యర్థులకు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నాయకులు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌జేసీ Mýృష్ణ, కార్పొరేటర్లు మచ్చ నరేందర్, పోట్ల శశికళ, పగడాల నాగరాజు, బుర్రి ఇందిర, దోరేపల్లి శ్వేత, చావా నారాయణరావు, సల్వాది వెంకన్న, దొంగరి నాగరాజు, పాలడుగు పాపారావు, కొప్పెర నర్సింహారావు, హనుమాన్, ఖమ్మం అర్బన్‌ జెడ్పీటీసీ వీరూనాయక్, ఎంపీపీ మాలోతు శాంత  తదితరులు పాల్గొన్నారు.

     

Advertisement

పోల్

Advertisement