ప్రభుత్వాస్పత్రులకు పురిటి నొప్పులు | hopstial problems | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రులకు పురిటి నొప్పులు

Published Thu, Jan 5 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

ప్రభుత్వాస్పత్రులకు పురిటి నొప్పులు

ప్రభుత్వాస్పత్రులకు పురిటి నొప్పులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసిబ్బంది కొరత...

అరకొర వసతులు..  వైద్యుల కొరత
గర్భిణులకు అందని పూర్తి స్థాయి వైద్యం
సిబ్బంది లేక కొత్త భవనాలు నిరుపయోగం


రామన్నపేట : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసిబ్బంది కొరత... అరకొర వసతులు పేద గర్భిణులకు శాపంగా మారాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరుగాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సౌకర్యాలు ఉన్న చోట నిర్లక్ష్యపు విధులతో సేవలు దూరమవుతుండగా.. మరి కొన్ని ప్రాథమిక కేంద్రాల్లో వైద్యసిబ్బంది కొరతతో అసలే సేవలందడం లేదు. గత సంవత్సరం అప్పటి కలెక్టర్‌ కరుణ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుగాలని సీహెచ్‌సీలను సందర్శించి కావాల్సిన వసతులను కల్పించినప్పటికీ నేటి వరకు కూడా కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుగుతున్న దాఖలాలు లేవు. దీనికి పలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ల్యాబ్‌ లేకపోవడం, సిబ్బంది కొరత వెరసి పేద గర్భిణులకు పూర్తి స్థాయిలో వైద్యం అందకకుండాపోతోంది.

ప్రసవాలకు దూరంగా పీహెచ్‌సీలు...
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2016 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు పది నెలల కాలంలో అలంకానిపేట, దామెర,  కడిపికొండ, బీజాపూర్, కోమల్ల, మేడపల్లి, నల్లబెల్లి, పర్వతగిరి, వేలేరు, గూడూరు వంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలే జరగులేదు. అలాగే ఈ పది నెలల కాలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని ఓ అద్దె భవనాన్ని వీరు బుధవారం పరిశీలించారు. మామునూరులోని విశాలమైన సొంత భవనాల్లో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీని సూర్యాపేటలో ఓ అద్దె భవనంలోకి మార్చుతుండడంపై వెటర్నరీ యూనివర్సిటీలోని సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కంటే మెరుగైన వసతులతో కాలేజీని తీర్చిదిద్దుతారని అనుకుంటే ప్రభుత్వం ఇంకో రకంగా చేస్తోందని అంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఏకైక వెటర్నరీ విద్యా సంస్థ తరలిపోతుంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలో మామునూరులో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటైంది. 2011లో ఈ కాలేజీని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత... పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

మామునూరులోని పాలిటెక్నిక్‌ కాలేజీ ఈ యూనివర్సిటీ పరిధిలోనే ఉంది. రెండేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సులో ఒక్కో తరగతిలో 20 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలోని విద్యార్థులకు మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీ అనువుగా ఉంటోంది. అయితే ప్రభుత్వం ఈ కాలేజీని సూర్యాపేటకు తరలిస్తుండడంతో ఈ జిల్లాల్లోని విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. మామునూరులోని పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలోనే రాష్ట్ర ప్రభుత్వం వెటర్నరీ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016–17 సంవత్సరంలోనే ఈ కాలేజీ ప్రారంభమవుతుందని ప్రకటించింది కూడా. వెటర్నరీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు సంగతి ఏమోగానీ... ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీ సైతం వెళ్లిపోతోంది. డిగ్రీ కాలేజీ ఏర్పాటు విషయం అటకెక్కడంతో మామునూరు ఇక నుంచి విద్యా కేంద్రాలు లేని ప్రదేశంగా మారే పరిస్థితి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement