నల్లగొండ టౌన్ : జిల్లా ప్రభుత్వ కేంద్ర వైద్యశాల సూపరింటెండెంట్‌గా డాక్టర్ టి.నర్సింగరావును నియమిస్తూ వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ అమర్ తన వ్యక్తిగత కారణాల వల్ల పదవీ నుంచి తప్పించాలని కోరుతూ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు దరఖాస్తు చేయడంతో ఆయనను తప్పించి డాక్టర్ నర్సింగరావుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డాక్టర్ నర్సింగరావు సోమవారం విధుల్లో చేరనున్నట్లు తెలిసింది.