
ఖమ్మంలో కారం బస్తాల కలకలం
ఖమ్మం: ఖమ్మంలోని అల్లిపురం కాలువ కట్టపై కారం బస్తాల కలకలం రేగింది. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సుమారు వెయ్యి కారం బస్తాలు కాలువ కట్టపై పడేసి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారం బస్తాలు కల్తీ కారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.