బొజ్జ గణపయ్యకు భారీ నైవేద్యం
కాజీపేట : కాజీపేట రహమత్‌నగర్‌లో జై గణేష్ యూత్ ఆధ్వర్యాన వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి యూత్ బాధ్యులు ఆది దేవుడికి స్వీట్లు, ఫలాలు కలిపి 175 రకాల నైవేద్యం సమర్పించారు. స్థానిక సీఐ రమేష్‌కుమార్, ఎస్సై భీమేష్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.