Vinayaka
-
వినాయకుడే వీళ్లకు పెళ్లి పెద్ద
కర్ణాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలి దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలి దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.ఇక్కడి మూలవిరాటై్టన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం. -
వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!
వాతాపి నగరానికి సాధువుల గుంపుతో కలసి ఒక పద్నాలుగేళ్ల కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు వాతాపి గణపతి ఆలయాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయాడు. అతడి ఊరేదో పేరేదో అతడికే తెలియదు. అతడి నుదుటి మీద గాయం మానిన మచ్చ చూసిన జనాలు, పాపం ఏదో దెబ్బ తగిలి గత స్మృతి అంతా పోగొట్టుకున్నాడని అనుకున్నారు. ఆ కుర్రవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎంతసేపూ వాతాపి ఆలయ మంటపం రాతి పలకల మీద, గోడల మీద సుద్దతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. బొమ్మలు గీస్తున్నంత సేపూ అతడి ముఖం చిరునవ్వుతో వెలుగుతూ ఉండేది. బొమ్మలు గీస్తూ ఆనందం పొందుతుండే ఆ బాలుడిని వాతాపి వాసులు చిత్రానందుడు, చిత్రముఖుడు అని పిలవసాగారు. అతడు ఎక్కువగా వినాయకుడి బొమ్మలే గీస్తుండటంతో వినాయక చిత్రకారుడనే పేరును సంక్షిప్తంగా మార్చి విచిత్రుడు అని పిలవసాగారు. కాలక్రమంలో ఆ బాలుడికి విచిత్రుడు అనే పేరు స్థిరపడింది.వాతాపి నగరంలో గణపతి భక్తుడైన గజానన పండితుడు రోజూ సాయంత్రం ఇంటి వద్ద పిల్లలకు వినాయక కథలు చెబుతుండేవాడు. మిగిలిన పిల్లలతో కలసి విచిత్రుడు కూడా గజానన పండితుడు చెప్పే కథలను అరుగు మీద కూర్చుని శ్రద్ధగా ఆలకించేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథలోని సన్నివేశాలను గోడల మీద చిత్రించేవాడు. విచిత్రుడు చిత్రించే వినాయకుని బొమ్మలు చూసి గజానన పండితుడు మురిసిపోయేవాడు. విచిత్రుడికి ఎన్నో విఘ్నేశ్వరుడి కథలను ప్రత్యేకంగా చెబుతుండేవాడు.విచిత్రుడి వెంట ఎప్పుడూ పిల్లలు గుంపులు గుంపులుగా ఉండేవారు. అతడు చిత్రించే బొమ్మలను వారు అబ్బురంగా చూస్తుండేవారు. కొందరు అతడిలాగా బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తూ చిత్రకళా సాధన చేస్తుండేవారు. విచిత్రుడి ప్రభావంతో వాతాపి నగరంలోని పిల్లలకు చిత్రకళ అబ్బింది.విచిత్రుడు పగలంతా గోడల మీద బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో కడుపు నింపుకొనేవాడు. రాత్రిపూట ఆలయం మెట్ల మీద ఒక మూలనో, ఊరి చివరనున్న వాడలో ఏ ఇంటి అరుగు మీదనో నిద్రపోయేవాడు. వాడలోని కుమ్మరులు, చర్మకారులు విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. అతడు ఏ రాత్రి వచ్చినా, అతడి కోసం దాచిపెట్టిన భోజనం తినిపించి, అతడి పడకకు ఏర్పాట్లు చేసి మరీ నిద్రపోయేవారు. అలా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు.కాలం ఇలా గడిచిపోతుండగా, వాతాపి నగరంలో వినాయక నవరాత్రుల కోలాహలం పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే మొదలైంది. ఉత్సవాల సందర్భంగా ఒక శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన విగ్రహాన్ని ఉత్సవ నిర్వాహకులు వెయ్యి బంగారు కాసులు ఇచ్చి కొంటారు. ఆ విగ్రహాన్ని మలచిన కళాకారుడిని నగరపాలకులు రత్నఖచిత స్వర్ణకంకణంతో ఘనంగా సత్కరిస్తారు.ఆ పోటీ ప్రదర్శనలో చుట్టుపక్కల రాజ్యాల ఆస్థాన చిత్రకారులు సహా ఎందరో పేరుగాంచిన శిల్పులు, చిత్రకారులు తమ తమ విగ్రహాలను తీసుకొచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలతో, రంగురాళ్లతో ఒకరిని మించి మరొకరు కళ్లు మిరుమిట్లు గొలిపేలాంటి వినాయక విగ్రహాలను రూపొందించి, ప్రదర్శనకు పెట్టారు.తాను రూపొందించిన విగ్రహాన్ని కూడా ప్రదర్శనలో పెట్టాలని విచిత్రుడు ఉబలాటపడ్డాడు. అతడికి ఒక కుమ్మరి మిత్రుడు ఉన్నాడు. విచిత్రుడు తీర్చిదిద్దిన రూపురేఖలతో అతడు బంకమట్టిని ఉపయోగించి విగ్రహం తయారు చేశాడు. సున్నం, బొగ్గుమసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లు ఉపయోగించి విచిత్రుడు ఆ విగ్రహానికి చక్కగా రంగులు వేశాడు. ప్రదర్శనలో పెట్టడానికి విచిత్రుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. అక్కడి పెద్దలందరూ విచిత్రుడి విగ్రహాన్ని ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. తన విగ్రహాన్ని చిట్టచివరనైనా ఉంచాలని విచిత్రుడు ఎంతగా ప్రాధేయపడినా, వారు కనికరించలేదు. ‘కులగోత్రాలు లేనివాడివి, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతుల వారితో కలసి తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశప్రతిష్ఠలు గల సుప్రసిద్ధ చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించే అర్హత లేదు’ అని నిర్దాక్షిణ్యంగా అతడి కోరికను తిరస్కరించారు.విచిత్రుడు చాలా బాధపడ్డాడు. అతడి బాధను చూసిన కుమ్మరి మిత్రుడు ‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు. మనం వేరే చోట ఈ విగ్రహాన్ని అందరికీ కనిపించేలా పెడదాం, పద!’ అని నచ్చచెప్పాడు. ప్రదర్శన పందిరికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మొదట్లో విగ్రహాన్ని పెట్టి, విచిత్రుడిని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. పెద్దలందరూ పందిరిలో ప్రదర్శించిన విగ్రహాలను తిలకిస్తుంటే, పిల్లలు మాత్రం గుంపులు గుంపులుగా విచిత్రుడు రంగులద్దిన విగ్రహం ముందు గుమిగూడారు.ఒకవైపు పందిట్లోని ప్రదర్శనలో పెద్దల సందడి, మరోవైపు చెట్టుకింద విగ్రహం వద్ద పిల్లల కోలాహలం కొనసాగుతుండగా, ఎక్కడి నుంచో ఇద్దరు యువతులు వచ్చారు. మెరుపుతీగల్లాంటి వారిద్దరూ నిండుగా విలువైన నగలు ధరించి కళకళలాడుతూ ఉన్నారు. జనం వారిని ఆశ్చర్యంతో చూస్తుంటే, వారిలోని పెద్దామె ‘అయ్యలారా! మాది కళానంద నగరం. మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకొచ్చాం’ అంటూ చేతిలోని బంగారు అల్లిక జలతారు సంచిని గలగలలాడించింది. ప్రదర్శనలో పిచ్చాపాటీ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న చిత్రకారులందరూ ఆమె మాటలతో అప్రమత్తమయ్యారు. ఎవరి విగ్రహాల దగ్గరకు వారు చేరి, గంభీరంగా నిలుచున్నారు.‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి. విగ్రహపుష్టి మాత్రమే కాదు, గొప్ప తిండిపుష్టి, గాత్రపుష్టి ఉన్నది. గొంతు విప్పిందంటే, ఆమె పాటకు ఎంతటి వారైనా మైమరచిపోవాల్సిందే!’ అంటూ ఇద్దరిలోనూ చిన్నది కాలి గజ్జెలను మోగిస్తూ, అక్కడున్న అందరి వంకా ఓరచూపులు విసిరింది.‘మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ. అంతకు మించి గొప్ప నర్తకీమణి. చూడటానికి నాజూకు చిన్నదిలా ఉన్నా, నాట్యమాడుతూ నన్నే ఎత్తి తిప్పేస్తుంది. నాట్యంలో దాని చురుకుదనం చూడటానికి రెండు కళ్లు చాలవు. మాతో ఆడించడం, పాడించడం సాక్షాత్తు ఇంద్రుడికి, కుబేరుడికే సాధ్యం కాదు. అయితే, ఇక్కడ మాకు నచ్చిన విగ్రహం ముందు ఆటపాటలను ప్రదర్శిస్తామని వినాయకుణ్ణి మొక్కుకున్నాం’ అని చెప్పింది ప్రసన్నవదన. వారి మాటలకు మంత్ర ముగ్ధులైన జనాలు, వారు విగ్రహాలు చూడటానికి వీలుగా పక్కకు తొలగి, దారి ఇచ్చారు.అక్కా చెల్లెళ్లిద్దరూ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆగి, వాటిని పరిశీలనగా చూస్తూ ముందుకు సాగారు. అన్ని విగ్రహాలనూ చూసినా, ఏదీ నచ్చకపోవడంతో పెదవి విరిచి బయటకు మరలుతుండగా, ప్రదర్శన పందిరి ఎదురుగా పిల్లల కోలాహలం కనిపించింది. ‘అక్కడ పిల్ల వెధవలెవరో తయారు చేసిన తక్కువరకం విగ్రహం ఉంది లెండి’ అని గుంపులోంచి ఎవరో అనడం వాళ్లకు వినిపించింది. అది విని మోహన, ‘పదవే అక్కా! అక్కడేదో విగ్రహం తక్కువలోనే దొరికేటట్లుంది’ అంటూ ప్రసన్నవదన చేయి పట్టుకుని అటువైపుగా దారితీసింది. ప్రదర్శనశాలలోని జనాలంతా వాళ్లనే అనుసరిస్తూ బయటకు వచ్చారు. ప్రదర్శనశాలలో ఒక్కరూ మిగల్లేదు.ప్రసన్నవదన చెట్టు కిందనున్న విగ్రహం వద్దకు వెళ్లి, ఆ విగ్రహం ముందు వరహాల సంచి పెట్టింది. తన మెడలోని రత్నహారాన్ని తీసి, విచిత్రుడి చేతికి కంకణంలా తొడిగింది. అది చూసిన జనం ‘వీళ్లకేదో పిచ్చి ఉన్నట్లుంది! గొప్ప విగ్రహాలను కాదని వచ్చి, ఈ నాసిరకం విగ్రహం ముందు డబ్బు ధారపోస్తున్నారు’ అన్నారు.వాళ్ల మాటలు విన్న ప్రసన్నవదన జనాల వైపు చూసి, ‘ఇక్కడున్న విగ్రహంలోని ఏ విశేషాన్ని చూసి పిల్లలందరూ మురిసి ముచ్చటపడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని కూడా ఆకట్టుకుంది. బాల దీవెనలు బ్రహ్మ దీవెనలు.అందుకే ఈ పిల్లల ఎంపికను శిరసావహిస్తున్నాము’ అని చెప్పింది.‘మట్టిశిల్పంలో లేని రూపసౌందర్యాన్ని సామాన్యమైన జేగురు వంటి రంగులతోనే తీర్చిదిద్దిన ఈ చిత్రకారుడి ప్రతిభ అమోఘం, అద్వితీయం. ఈ విగ్రహానికి మా బహుమానం అతిస్వల్పం’ అంది మోహన.‘మా కోరిక నెరవేరింది. ఇక్కడే మా మొక్కు చెల్లించుకుంటాం’ చెప్పింది ప్రసన్నవదన.వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని, ప్రసన్నవదన తాళాలు మోగిస్తూ, ‘తాండవ నృత్యకరీ గజానన’ అంటూ కీర్తన మొదలుపెట్టింది. ఆ వెంటనే మోహన విద్యుల్లతలా నాట్యం ప్రారంభించింది. జనాలందరూ విస్మయచకితులై ఆ ప్రదర్శనను తిలకించసాగారు.ప్రసన్నవదన గానం ఇంట్లో ఉన్న గజానన పండితుడి చెవిన పడింది. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆయన ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్నాడు. అయితే, ప్రసన్నవదన గానానికి ఆయనకు ఎక్కడలేని జవసత్త్వాలూ వచ్చాయి. మంచం మీద నుంచి లేచి, ఒక్క పరుగున ప్రదర్శన జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. ప్రసన్నవదనను చూసి, చేతులెత్తి జోడించి, సాగిలబడి, ధ్యాన ముద్రలో అలాగే ఉండిపోయాడు.నృత్యం చేస్తూ, చేస్తూ మోహన అంత పెద్ద వినాయక విగ్రహాన్నీ భుజం మీదకెత్తుకుంది. అది చూసిన జనం ‘అంత బరువు మోయలేవమ్మా! పడిపోతావు!’ అని కేకలు వేశారు. ‘నాకు అలవాటేగా!’ అని చెబుతూ ఆమె విగ్రహాన్ని భుజాన పెట్టుకునే నాట్యం చేస్తూనే పరుగులాంటి నడకతో బయలుదేరింది. జనం ఆమెను పరుగు పరుగున అనుసరించారు. ఈ సందడిలో ప్రసన్నవదన ఎప్పుడు అదృశ్యమైపోయిందో కూడా ఎవరూ గుర్తించలేదు.మోహన ఆలయ తటాకం వద్దకు చేరుకుంది. నాట్యం చేస్తూ, ఒక్కొక్క మెట్టే దిగుతూ తటాకంలో మునిగి అదృశ్యమైంది. కొద్ది క్షణాల్లో ఒక చిట్టెలుక విగ్రహాన్ని వీపున మోసుకుంటూ, నీటిలోకి మాయమైంది. ఆ రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజు. జనాలు ఈ దృశ్యాన్ని చూసి, దిగ్భ్రాంతులయ్యారు.గజాననుడు ధ్యానముద్ర నుంచి తేరుకునే సరికి చెట్టు కింద విచిత్రుడు, అతడి కుమ్మరి మిత్రుడు, బంగారు జలతారు వరహాల సంచి తప్ప మరేమీ కనిపించలేదు. గజాననుడు లేచి, విచిత్రుడి వద్దకు వెళ్లి, అతడి తలమీద చేయివేసి ‘వాతాపి గణపతి ఆలయాన్ని నీ కళతో చిత్రశోభితం చేయి. కావలసిన ధనాన్ని ఆ విఘ్ననాయకుడే అనుగ్రహించాడు కదా! నీ వల్ల వాతాపి నగరం పావనమైంది. ఇక నుంచి నువ్వు పావనమిశ్రుడిగా ప్రఖ్యాతి పొందుతావు’ అని ఆశీర్వదించాడు. – సాంఖ్యాయన(చదవండి: దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?) -
హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన కోలాహలం
-
నాదో విన్నపం మహర్షీ!
‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరన్న సందేహం కలిగింది. కాసేపు కన్నులు మూసుకుని దేవతలందరినీ తలచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు. ఈ క్రమంలో ఓం ప్రథమంగానే పార్వతీ తనయుడైన గణపతి రూపం మదిలో మెదిలింది. తన కావ్య రచనకు సమర్థుడు వినాయకుడే అని అవగతమైంది, ఆయనను ప్రార్థించాడు. వెను వెంటనే గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ‘ధన్యోస్మి వినాయకా’ అని వేదవ్యాసుడు నమస్కరించగా, ‘‘వేదపారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతి నమస్కారం చేశాడు. మహాభారతాన్ని తాను చెబుతుంటే, గణపతి లిఖిస్తే బాగుంటుందన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు వ్యాసుడు. గణపతి అందుకు ఆనందంగా అంగీకరిస్తూనే, ‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడా ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంట వెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తరువాతనే రాయాలి సుమా..’’ అన్నాడు.అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడు. సరే ననక తప్పదు అనుకుని, ‘నాకూ మంచిదే ఆ మహాగ్రం«థమెన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’ అని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహంలా నిరాటంకంగా, నిరంతరాయంగా సాగిపోతోంది. వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్నీ వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ ఆనందిస్తూ దానిని గ్రంథస్థం చేసుకుంటూ పోతున్నాడు. తదుపరి శ్లోక రచనకు తనకు ఇంకాస్త సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవాడు. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గణపతి కాస్త నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. ఆ విధంగా ఇద్దరూ ఒకరి వైదుష్యానికి మరొకరు భంగం కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా. అందుకే దేనికైనా సమఉజ్జీలు ఉండాలంటారు. – డి.వి.ఆర్. -
గణనాథా.. కరుణ చూపవా
అనంతపురంలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాల మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి లక్ష మోదకాల పూజ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వాసవీ మహిళా మండలి నిర్వాహకులు తరలిరావడంతో అమ్మవారిశాల కిటకిటలాడింది. బెంగళూరు నుంచి వచ్చిన వేదపండితులు గణపతి, వరుణ హోమాలు నిర్వహించారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కొత్తూరు మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ వాసవీ అమ్మవారికి వజ్రాల చీరను అలంకరించారు. ఈ సందర్భంగా కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు మాట్లాడుతూ అనంత రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా లక్ష మోదకాల పూజ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొడమల రమేష్ బాబు, టంగటూరు నాగభూషణ, తల్లం మురళి, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. - అనంతపురం కల్చరల్ -
విఘ్నేశ్వరునికి క్షీరాభిషేకం
ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు కాణిపాకం (ఐరాల) : స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేకోత్సవాలలో సోమవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవ సందర్భంగా ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. ఉభయదారులు మణికంఠేశ్వర ఆలయం నుంచి పాలబిందెలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. తొలుత స్థానిక మరగదాంబికా సమేత మనికంఠేశ్వరస్వామి ఆలయంలో క్షీర కలశాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఆర్సీపీకి చెందిన నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆర్కే.రోజా, డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆలయంలోని అలంకార మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ చంద్రప్రభ వాహనసేవకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ అగరంపల్లెకు చెందిన జీ.కేశవులు సోమవారం ఉదయం తమ గ్రామం నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.వీటిని స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లిఖార్జున పాల్గొన్నారు. -
వినాయక నిమజ్జనంలో విషాదం
గీసుకొండ : వినాయక విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి నీట ముని గి మృతిచెందిన సంఘటన మండలంలోని శాయంపేట హవేలిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకా రం.. శాయంపేట హవేలి గ్రామంలో ఈ నెల 14న(బుధవారం) రాత్రి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి గ్రామ శివారులోని చెరువు వద్దకు గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లారు. నిమజ్జన సమయం లో అదే గ్రామాని కి చెందిన చల్లా వేణుగోపాల్(38) చెరువులోకి దిగి నీట మునిగాడు. అయితే అక్కడున్న వారెవరూ గమనించలేదు. ఈ విషయం తెలియని బంధువులు అతడి గురించి పలుచోట్ల వెతికగా ఆచూకీ తెలియలేదు. మృతు డి సోదరుడు శుక్రవారం చెరువు వద్దకు వెళ్లి చూడగా వేణుగోపాల్ మృతదేహం నీటిపై తేలు తూ కనిపించింది. మృతుడి తల్లి కాం తమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై నవీ¯Œ కుమార్ తెలిపారు. -
అవిఘ్నమస్తు
-
బొజ్జ గణపయ్యకు భారీ నైవేద్యం
కాజీపేట : కాజీపేట రహమత్‌నగర్‌లో జై గణేష్ యూత్ ఆధ్వర్యాన వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి యూత్ బాధ్యులు ఆది దేవుడికి స్వీట్లు, ఫలాలు కలిపి 175 రకాల నైవేద్యం సమర్పించారు. స్థానిక సీఐ రమేష్‌కుమార్, ఎస్సై భీమేష్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
వినాయకా..సెలవిక!
-
నిమజ్జనోత్సవానికి ముందుచూపు ‘కరువు’
వెలవెలబోతున్న మానకొండూర్ చెరువు కాకతీయ కాలువ ద్వారా నింపేందుకు చర్యలు పూర్తిస్థాయిలో నిండాలంటే 15రోజులు గతేడాది అసంపూర్తిగా నిమజ్జనం మానకొండూర్ : వినాయక నిమజ్జనోత్సవానికి అధికారుల్లో ముందుచూపు కరువైంది. వర్షాభావ పరిస్థితులతో మానకొండూర్ పెద్ద చెరువు వెలవెలబోతోంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాకేంద్రంతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తుంటారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా మానకొండూర్ చెరువును నింపుతామని అధికారులు హామీ ఇస్తున్నా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అధికారులు చెప్పినట్లు కాకతీయ కాలువ ద్వారా నీరు విడుదల చేసినా చెరువు పూర్తిస్థాయిలో నిండాలంటే సుమారు 15 రోజులు పడుతుంది. మరోవైపు నిమజ్జనోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో చెరువు నిండాలంటే సాధ్యం కాదు. ఒకవేళ శుక్రవారం ఉదయం నుంచి నీరు వదిలినా.. నిమజ్జనం సమయానికి ఒకటి, రెండు ఫీట్ల మేర తప్ప ఎక్కువ పెరగదు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచే అధికారులు మానకొండూర్ చెరువును నింపే పనులు చేస్తే బావుండేదని మండపాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. డెడ్ స్టోరేజీలో నీరు మానకొండూర్ పెద్ద చెరువు విస్తీర్ణం 375 ఎకరాలు. 680 ఎకరాల ఆయకట్టు. 18 ఫీట్ల మేర నీరు నిల్వ చేయెుచ్చు. కానీ.. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం రెండుఫీట్ల (డెడ్‌స్టోరేజీ) నీరుంది. ఈ చెరువును నింపేందుకు కాకతీయ కాలువ డీబీఎం 2, 2సీ, డీబీఎం 3 ద్వారా నీటిని వదిలేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ పనులు రెండురోజులుగా సాగుతూనే ఉన్నాయి. కాకతీయ కాలువలో ఇసుకబస్తాలను అడ్డుగా వేసి నీటిని మళ్లించే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడూ.. విగ్రహాలను నిమజ్జనం చేసేదెలా..? అని నిర్వాహకులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు చెరువుకట్టపై ఐదు భారీ క్రేన్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. భారీ విగ్రహాలకు ఇబ్బందే.. జిల్లాకేంద్రం నుంచి ఏటా వందలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. భారీ విగ్రహాలైనా.. ఈ చెరువుకు రావాల్సిందే. యేటా ఏడువందలకు పైగా భారీ వినాయక విగ్రహాలు, వందల సంఖ్యలో చిన్న పాటి విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటారు. నాలుగేళ్లుగా ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువు వెలవెలబోతోంది. గతేడాది వినాయక నిమజ్జనానికి చెరువులో చుక్కనీరు లేకపోవడంతో అధికారులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నింపే ప్రయత్నం చేశారు. నిమజ్జనం సమయానికి రెండు, మూడు ఫీట్ల మేర మాత్రమే నీరు చేరింది. ఫలితంగా కొన్ని విగ్రహాలను చెరువుకట్టపైనే వేయాల్సి వచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో ఫైరింజన్ సహాయంతో విగ్రహాలపై నీళ్లు చల్లించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. -
కరుణించు తండ్రీ..
పుట్లూరు : కరువుతో జనం కష్టాల్లో ఉన్నారు. అయినా చవితి పండుగ నాడు నాకు ఏ లోటూ చేయలేదు. కడుపారా ఉండ్రాళ్లు పెట్టారు. వారి స్తోమతను బట్టి విగ్రహాలను కొలువుదీర్చారు. ఆటపాటలతో నన్ను అలరించారు. వారి కన్నీటి కష్టాలను దాచిపెట్టుకుని.. నన్ను మాత్రం కన్నబిడ్డలా ఆదరించారు. అంతే ఆదరణతో గంగమ్మ ఒడికి చేర్చాలని తపన పడ్డారు. అయితే.. చెరువులు, వాగులు, వంకలు ఇలా ఎక్కడ వెతికినా గంగమ్మ ‘తల్లి’ జాడ కన్పించలేదు. పాపం..! ఇక వారు ఇంతకన్నా ఏం చేయగలరు?! అందుకే నన్నిలా వదిలివెళ్లారు. తండ్రీ.. కరుణించు! గంగమ్మను పంపి..జలకళను ప్రసాదించు! నీ బిడ్డను ఆదరించిన ఈ జనం రుణం కొంతైనా తీర్చుకో! -
భారీ గణనాథులకు తూర్పు జిలుగులు
గొల్లపాలెం(కాజులూరు) : తెలుగు రాష్ట్రాల్లో భారీ గణనాథులకు రంగుల జిలుగులు అద్దేది మన జిల్లా వాసులే కావడం చెప్పుకోదగ్గ విషయం. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడు దేశం వ్యాప్తంగా పేరు గడించాడు. అక్కడ ఏటికేడూ భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఆ విగ్రహాలకు పదకొండేళ్లుగా కాజులూరు మండలం గొల్లపాలానికి చెందిన ‘సత్య ఆర్ట్స్’ సభ్యులు రంగులు వేస్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన గీసాల వీరవెంకట సత్యనారాయణ (సత్య) తన మిత్రబృందంతో కలసి ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకుడికి రంగులు వేసేందుకు హైదరాబాద్ వెళ్లేవాడు. ఐదేళ్ల క్రితం ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆయన సోదరుడు భీమేశ్వరరావు (భీమేష్) ఆ బాధ్యతను స్వీకరించారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 58 అడుగుల ∙వినాయక విగ్రహానికి సత్య ఆర్ట్స్ సభ్యులే రంగులు వేశారు. అలాగే విజయవాడలో 72 అడుగుల మట్టిగణపతి విగ్రహానికి వీరే రంగులు వేశారు. లాభనష్టాల మాట ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సాధించిన వినాయక విగ్రహాలకుS తమ బృదం రంగులు వెయ్యటం ఎంతో సంతృప్తికరంగాఉందని బీమేష్ అన్నారు. ఇరు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలకు రంగులు వేసేందుకు వెళ్లిన కళాకారులు ఆదివారం రాత్రి గ్రామానికి చేరుకున్నారు. -
ముస్తాబైన అయినవిల్లి
నేటి నుంచి 13 వరకూ నవరాత్రి మహోత్సవాలు అయినవిల్లి : కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు కోనసీమలో కొలువుదీరిన అయినవిల్లి విఘ్నేశ్వరుడు. స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలు అషై్టశ్వర్యాలతో తులతూగుతారనేది భక్తుల నమ్మకం. చవితి రోజున విఘ్నేశ్వర S స్వామి వారిని దర్శిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతారు. స్వామివారికి ఈ తొమ్మిది రోజులూ విశేష పూజలు జరుపుతారు. ఈ నవరాత్రుల్లో సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారని అంచనా. దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయం వద్ద బ్యారికేడ్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన దేవతల ఆకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రాకారానికి, గోపురాలకు రంగులు అద్దారు. చవితి ఉత్సవాల తొమ్మిది రోజులూ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా ఆలయంలో మండపాలను నిర్మించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ కమిటీ చైర్మన్ రావిపాటి సుబ్బరాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు (సతీష్‌రాజు) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వినాయక చవితినాడు స్వామివారికి సీజనల్ పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు, లక్ష దుర్వార్చన, లక్ష్మీగణపతిహోమం నిర్వహిస్తారు. భక్తులందరికీ స్వామి వారి రవ్వలడ్డు, పులిహోర ప్రసాదం అందజేసేందుకు ప్రత్యేకంగా పనివారిని నియమించి తయారు చేయిస్తున్నారు. ఆలయం వద్ద తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అయినవిల్లికి ఇలా చేరుకోవచ్చు రాజమండ్రి నుంచి రావులపాలెం, కొత్తపేట మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, ఎదుర్లంక బ్రిడ్జి మీదుగా అమలాపురం చేరుకుని అయినవిల్లిలో విఘ్నేశ్వరుని సన్నిధికి రావచ్చు. కాకినాడ నుంచి రామచంద్రపురం, ద్రాక్షరామ మీదుగా కోటిపల్లి రేవు దాటి అయినవిల్లి చేరుకోవచ్చు. -
వజ్రాలున్నాయని వినాయక విగ్రహం పేల్చివేత
మడికొండ: వజ్రాలున్నాయనే అనుమానంతో ఓ పురాతన రాతి వినాయక విగ్రహాన్ని కొందరు దుండగులు పేల్చివేశారు. అందులో ఏమి లభించకపోవడంతో విగ్రహ శకలాలను చెరువులో వేసేందుకు వెళ్తూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన మడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండపర్తిలో జరిగింది. మడికొండ సీఐ డేవిడ్‌రాజ్ కథనం ప్రకారం.. హన్మకొండ మండలం కొండపర్తి గ్రామంలోని త్రికుటాలయంలో వినాయకుడి రాతి విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో వజ్రాలున్నాయని ప్రచారం ఉండడంతో 2015 నవంబర్ 22న ఇల్లందుల వీరస్వామి, కట్కూరి మధుకర్(కొండపర్తి), గొలనుకొండ నవీన్, కొమురవెల్లి అనిల్ కుమార్(జేపీఎన్ రోడ్డు, వరంగల్), ఇల్లందుల అజయ్, ముప్పారపు మనోజ్(శివనగర్), నెల కంటి యాకూబ్(పడమర కోట), నల్లం దుర్గ(గిర్మాజీపే ట), మంద కిషోర్(కరీమాబాద్), తాటికాయల ఏలియా(మల్లక్‌పల్లి), సతీష్, మంద సతీష్(పసరకొండ) దొంగి లించారు. విగ్రహాన్ని పేలుడు పదార్థంతో పేల్చగా ముక్కలైపోయింది. అందులో ఏమి దొరకకపోవడంతో శకలాలను ఉర్సు దగ్గర చెరువులో వేయడానికి బయల్దేరారు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వారు నింది తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. వారు ఉపయోగించిన జేసీబీ ప్రొక్లైనర్, 2 బైక్‌లు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డేవిడ్‌రాజ్ తెలిపారు. -
వినాయక మండపం వద్ద ఘర్షణ
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. బోజగుట్టలోని వివేకానందనగర్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్ధరాత్రి దాటాక ఈ ప్రాంతంలోని ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. రెండు వర్గాలకు చెందిన వారు ఆసిఫ్‌నగర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనక శుక్రవారం సాయంత్రం మండపం ముందు నుంచి వెళ్తున్న ఇద్దరు యువతులను దూషించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
ట్యాంక్‌బండ్ వద్ద మృతదేహం కలకలం
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. క్రేన్ నెంబరు20 వద్ద ఆదివారం వినాయకుడి నిమజ్జనం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఓ వైపు గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంటే.. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?
విశాఖపట్నం: వినాయక ఉత్సవాల నిర్వహణ తీరుపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాన్ని పాటించకుండా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయడాన్ని సాధుపరిషత్ ఆక్షేపించింది. గబ్బర్ సింగ్, బాహుబలి, సిక్స్ ప్యాక్ వినాయకుడంటూ ఏర్పాట్లు చేస్తున్నారని సాధువు శ్రీనివాసనంద సరస్వతి మండిపడ్డారు. ఇది అపరాధం, పాపం కాదా అని ప్రశ్నించారు. దేవున్ని దేవునిగానే చూడండి.. విందు వినోదాల కోసం వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయొద్దన్నారు. వినాయ చవితి నిర్వహణ పై హైకోర్టులో రిట్ వేస్తామన్నారు. -
మట్టి గణపతినే పూజిద్దాం!
-
వినాయక చవితి శుభాకాంక్షలు
-
వక్రతుండ.. మహాకాయ
ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు 59 అడుగుల ఎత్తు.. 5,600 కిలోల లడ్డూ.. 75 అడుగుల యజ్ఞోపవీతం గణనాథుడి గ‘ఘన’ రూపాన్ని దర్శించుకోవాలన్నా... గౌరీతనయుడి ప్రత్యేకతలను కనులారా వీక్షించాలన్నా ఖైరతాబాద్‌కు క్యూ కట్టాల్సిందే.. వక్రతుండుడు ఇక్కడ ఎప్పుడూ మహాకాయుడే.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏటా ఒక్కో అడుగు పెరిగే ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి లంబోదరుడు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. అవేంటో ఒకసారి తెలుసుకుందామా... - హైదరాబాద్ గ‘ఘన’ స్వరూపం.. ఖైరతాబాద్ వినాయకుడంటేనే ఆకాశమంత ఎత్తు... అబ్బురపరిచే రూపం.. ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా 59 అడుగుల ఎత్తులో ఇక్కడి మూషికవాహనుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రధాన విగ్రహానికి కుడివైపు గజేంద్ర మోక్షం, ఎడమ వైపున వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది నుంచి గణేశుడి ఎత్తు ఒక్కో ఏడాది ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. పత్రం..ఫలం.. ఘనం.. - ప్రతి ఏటా మాదిరిగానే ఇక్కడి మహాగణపతికి ఖైరతాబాద్ పద్మశాలి సంఘం 75 అడుగుల యజ్ఞోపవీతం, 80 అడుగుల పొడవైన కండువాను సమర్పిస్తారు. వీటిని నల్లగొండ జిల్లాలో తయారు చేయించారు. - తొలిసారిగా నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి హ్యాండ్లూమ్ విలేజ్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 60 అడుగుల కండువాను చవితి రోజున మహా గణపతికి సమర్పించనున్నారు. - 11 రోజుల పాటు గణపయ్యకు అంబికాదర్బార్ కంపెనీ అగర్బత్తి మహాధూపాన్ని సమర్పిస్తోంది. ఈ ఏడాది 10 అడుగుల అగర్బత్తిని తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఏలూరులో 15 రోజుల పాటు 10 మంది కార్మికులు కలసి దీన్ని రూపొందించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ అగర్బత్తి మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంటుందని అంబికా సేల్స్ మేనేజర్ మహేందర్ చెప్పారు. 20 టన్నుల స్టీలు.. 200 లీటర్ల రంగు.. ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహాల తయారీని జూన్ 12 న మొదలుపెట్టారు. సెప్టెంబర్ 10 నాటికి పనులన్నీ పూర్తయ్యాయి. మహాగణపతి విగ్రహం తయారీకి 20 టన్నుల స్టీలు, 34 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, 75 బండిళ్ల కొబ్బరి నార, 600 బ్యాగుల బంకమట్టి, 30 లీటర్ల ఫెవికాల్, 50 సబ్బులు, 40 లీటర్ల నూనె, 22 టన్నుల కర్రలు, 200 లీటర్ల రంగులను వినియోగించినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. గులాబీ, పసుపు, ఎరుపు వర్ణంలో ప్రతి ఏటా దర్శనమిచ్చే ఇక్కడి గణపయ్య రంగు ఈ ఏడాది మారింది. నీలిమేఘ వర్ణంలో ఈసారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు కనువిందు చేయనున్నాడు. మొత్తంగా విగ్రహాల తయారీకి రూ. 50 లక్షలు ఖర్చైనట్లు నిర్వాహకులు చెప్పారు. తాపేశ్వరం నుంచి మహాలడ్డూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు 5,600 కిలోల భారీ లడ్డూను ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించనున్నారు. మహా ప్రసాదం తయారీ సోమవారం రాత్రికి పూర్తయినట్లు తెలిపారు. బుధవారం తాపేశ్వరం నుంచి హైదరాబాద్‌కు ఈ ప్రసాదాన్ని తరలించనున్నట్లు వెల్లడించారు. -
బ్లాక్ బస్టర్... వినాయకుడు..!
ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ గా కోట్ల రూపాయల బిజినెస్ చేసిన తెలుగు సినిమా అంటే చిన్నపిల్లలు కూడ చెప్పేస్తారు బాహుబలి అని. అయితే అటువంటి ప్రత్యేకతలు ఉన్న సినిమాలు ఎప్పుడు మార్కెట్లో వచ్చినా ప్రేక్షకులు నీరాజనాలు పట్టడమే కాక... అభిమానులు ఆ గుర్తులను చాలాకాలం చెరిగిపోనివ్వరు. ఆ సమయంలో వచ్చే పండుగలు, ఉత్సవాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్ లు ఒకటేమిటి కొన్నాళ్ళపాటు ప్రతి విషయంలోనూ ఆ సినిమా ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత వైభవంగా జరిపే వినాయక చవితి సందర్భంలోనూ బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. దేశంలోనే గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో ముంబై ముందుంటుంది. అందులోనూ కొత్త పద్ధతులు పరిచయం చేయడంలోనూ ఆ నగరం ఎప్పుడూ ఫస్టే. ప్రతిఏటా నవరాత్రుల్లో వీధి మండపాల్లో వినూత్న రీతుల్లో కనిపించే గణేశుడిపై ఈసారి బాహుబలి ఎఫెక్ట్ బాగానే పడింది. భారీ కటౌట్ తో శివలింగాన్ని అలవోకగా భుజాన పెట్టుకొని ఆ ఆజానుబాహుడు (ప్రభాస్) వేసిన అడుగులు సినిమాలో సూపర్ డూపర్ హిట్. అందుకేనేమో ఆ ఎఫెక్ట్ ఈసారి వినాయక విగ్రహాలపై కనిపించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రుల్లో బాహుబలి స్టైల్ విగ్రహాలు భారీగానే కనిపించనున్నాయి. వినూత్న రీతిలో తయారైన ఈ తరహా విగ్రహాలకు మార్కెట్లో మంచి ఆదరణకూడ కనిపిస్తోంది. ప్రతియేటా వినాయక ప్రతిమలను తయారు చేసే కళాకారులు వివిధ రూపాలను, వ్యక్తిత్వాలను, ఆయా సందర్భాల్లో జరిగిన అభివృద్ధి సంఘటనలను తమ దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి ఒక్క ముంబైలోనే కాక, దేశంలోని పలు నగరాల్లో కళాకారుల చేతిలో భుజాన శివలింగాన్ని పెట్టుకున్న వినాయకుడు (ప్రభాస్ లా) రూపొందడం ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణంగా వినాయకుడంటే మనకు గుర్తుకు వచ్చే ఆకారం భారీ ఉదరం. అయితే ఈ సీజన్ లో మాత్రం అభిమానులను తన బాడీతో ఫ్లాట్ చేసిన ప్రభాస్ లా.. గణపతి దేవుడు సిక్స్ ప్యాక్ బాడీతో ఉండటం విశేషం. ఈ ఎఫెక్ట్ పై ఫాన్స్ కూడ... ''ఆ కటౌట్ అలాంటిది మరి'' అంటున్నారు.