గణనాథా.. కరుణ చూపవా | laksha modakala pooja in anantapur | Sakshi
Sakshi News home page

గణనాథా.. కరుణ చూపవా

Published Tue, Jun 13 2017 10:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

గణనాథా.. కరుణ చూపవా - Sakshi

గణనాథా.. కరుణ చూపవా

అనంతపురంలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాల మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి లక్ష మోదకాల పూజ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి  వాసవీ మహిళా మండలి నిర్వాహకులు తరలిరావడంతో అమ్మవారిశాల కిటకిటలాడింది. బెంగళూరు నుంచి వచ్చిన వేదపండితులు గణపతి, వరుణ హోమాలు నిర్వహించారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కొత్తూరు మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ వాసవీ అమ్మవారికి వజ్రాల చీరను అలంకరించారు.

ఈ సందర్భంగా కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు మాట్లాడుతూ అనంత రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా లక్ష మోదకాల పూజ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొడమల రమేష్‌ బాబు, టంగటూరు నాగభూషణ, తల్లం మురళి,  భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
- అనంతపురం కల్చరల్‌ 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement