భారీ గణనాథులకు తూర్పు జిలుగులు
భారీ గణనాథులకు తూర్పు జిలుగులు
Published Sun, Sep 4 2016 11:44 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
గొల్లపాలెం(కాజులూరు) : తెలుగు రాష్ట్రాల్లో భారీ గణనాథులకు రంగుల జిలుగులు అద్దేది మన జిల్లా వాసులే కావడం చెప్పుకోదగ్గ విషయం. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడు దేశం వ్యాప్తంగా పేరు గడించాడు. అక్కడ ఏటికేడూ భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఆ విగ్రహాలకు పదకొండేళ్లుగా కాజులూరు మండలం గొల్లపాలానికి చెందిన ‘సత్య ఆర్ట్స్’ సభ్యులు రంగులు వేస్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన గీసాల వీరవెంకట సత్యనారాయణ (సత్య) తన మిత్రబృందంతో కలసి ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకుడికి రంగులు వేసేందుకు హైదరాబాద్ వెళ్లేవాడు. ఐదేళ్ల క్రితం ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆయన సోదరుడు భీమేశ్వరరావు (భీమేష్) ఆ బాధ్యతను స్వీకరించారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 58 అడుగుల ∙వినాయక విగ్రహానికి సత్య ఆర్ట్స్ సభ్యులే రంగులు వేశారు. అలాగే విజయవాడలో 72 అడుగుల మట్టిగణపతి విగ్రహానికి వీరే రంగులు వేశారు. లాభనష్టాల మాట ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత సాధించిన వినాయక విగ్రహాలకుS తమ బృదం రంగులు వెయ్యటం ఎంతో సంతృప్తికరంగాఉందని బీమేష్ అన్నారు. ఇరు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలకు రంగులు వేసేందుకు వెళ్లిన కళాకారులు ఆదివారం రాత్రి గ్రామానికి చేరుకున్నారు.
Advertisement