కడప పట్టణంలోని శ్రీరాంనగర్‌కుచెందిన నారాయణ అనే వ్యక్తి అనుమానంతో భార్య గంగాదేవి(29)ని మచ్చుకత్తితో నరికి హతమార్చాడు.
కడప పట్టణంలోని శ్రీరాంనగర్‌కుచెందిన నారాయణ అనే వ్యక్తి అనుమానంతో భార్య గంగాదేవి(29)ని మచ్చుకత్తితో నరికి హతమార్చాడు. ఈ సంఘటన బుధవారం వేకువజామున జరిగింది. నారాయణ బేల్దారి పనిచేసి జీవించేవాడు. భార్యపై అనుమానంతో తరుచూ వేధించేవాడు. బుధవారం వేకువజామున మాటామాటా పెరిగి మచ్చుకత్తితో నరికి హతమార్చాడు. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలికి నాలుగేళ్ల కూతురు ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.