భర్త చేతిలో భార్య హత్య | husband murders his wife | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో భార్య హత్య

Published Wed, Dec 28 2016 10:18 PM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

భర్త చేతిలో భార్య హత్య - Sakshi

భర్త చేతిలో భార్య హత్య

కుందుర్పి : బసాపురం గ్రామంలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, రాయదుర్గం సీఐ చలపతిరావు, బ్రహ్మసముద్రం ఎస్‌ఐ రెహమాన్‌ బుధవారం మీడియాకు వివరించారు. కుందుర్పి మండలం బసాపురం గ్రామానికి చెందిన మాల శ్రీరాములుకు ఎనిమిదేళ్ల క్రితం శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన భాగ్యమ్మ(25)తో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కూతురు లక్ష్మి, రెండేళ్ల కుమారుడు శశిధర్‌ ఉన్నారు. ఏడాది కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీరాములు రోజూ తప్పతాగి వచ్చి గొడవ పెట్టుకునేవాడు. భర్త పెట్టే హింసను భరించలేక ఆమె నెలరోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది.

గత ఆదివారం శ్రీరాములు తన తల్లితో కలిసి శెట్టూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇక నుంచి భార్యను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సోమవారం భార్యను మెట్టినిల్లు బసాపురం తీసుకొచ్చాడు. అయితే అతని వైఖరిలో ఎటువంటి మార్పూ రాలేదు. మంగళవారం మరోసారి పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో భార్య భాగ్యమ్మతో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయి చాకుతో గొంతు, తలపై పొడిచి చంపి, అక్కడి నుంచి పరారయ్యాడని డీఎస్పీ తెలిపారు. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన పిల్లలు గట్టిగా ఏడ్వడంతో చుట్టుపక్కల వారు వచ్చి, మృతురాలి బంధువులకు సమాచారం అందించారన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement