bhagyamma
-
మరో ఇద్దరి బలవన్మరణం
- మొన్న ముగ్గురు, నిన్న ముగ్గురు.. నేడు ఇద్దరు.. - ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు జిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా, నిన్న మరో ముగ్గురు బలవన్మరణం చెందారు. తాజాగా ఇద్దరు బలవంతపు చావు చచ్చారు. అంతులేని ఆత్మహత్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రొద్దం(పెనుకొండ) : రొద్దం మండలంశేషాపురంలో కురుబ భాగ్యమ్మ(42) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. భాగ్యమ్మ, ఆమె భర్త శ్రీరాములు ఇద్దరూ కలసి గొర్రెలను తోలుకుని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి శనివారం వెళ్లారన్నారు. మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిందిగా భర్త సూచించారన్నారు. అయితే ఆమె ఇంటికెళ్లకుండా మార్గమధ్యంలోనే చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. రాత్రి ఇంటికొచ్చిన భర్తకు భార్య కనిపించకపోవడంతో అటవీ ప్రాంతంలో గాలించారు. అయినా ఆచూకీ కనబడలేదు. ఆదివారం మరోసారి గాలించగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించిందని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి వెళ్లారు. ఘటనపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మృతురాలికి డిగ్రీ చదివే కూతురు, ఇంటర్ చదివే కుమారుడు ఉన్నారు. ధర్మవరంలో మరొకరు.. ధర్మవరం అర్బన్ : ధర్మవరం కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీలో నివసిస్తున్న మల్లికార్జున(45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టన పోలీసులు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నూనె అంగట్లో గుమాస్తాగా పని చేసే మల్లికార్జున కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవాడన్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక మార్చురీకి తరలించారు. మృతునికి భార్య తులసమ్మ, కుమారుడు ఓంకార్ ఉన్నారు. మల్లికార్జున మృతదేహం వద్ద వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
గంటల వ్యవధిలోనే దంపతుల మృతి
రొళ్ల : ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తల్లిదండ్రులు గంటల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచిపెట్టడంతో ఆ కుటుంబం కకావికలమైంది. వివరాల్లోకి వెళితే... రొళ్ల మండలం హుణిసేకుంటకు చెందిన గోవిందప్ప, భార్య భాగ్యమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గోవిందప్ప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించా నయంకాలేదు. రెండు రోజుల క్రితం గోవిందప్ప (42) ఇంటి వద్దే చనిపోయాడు. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో మనో వేదనకు గురైన భాగ్యమ్మ (35) కూడా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. వారి సమాధులను కూడా పక్క పక్కనే పూడ్చిపెట్టారు. తల్లిదండ్రులిద్దరినీ ఒకే సారి కోల్పోవడంతో వారిద్దరి కుమారులు, కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అనాథలైన వారికి అండగా ఉంటామని గ్రామస్తులు చెప్పారు. వారంతా కలిసే అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
భర్త చేతిలో భార్య హత్య
కుందుర్పి : బసాపురం గ్రామంలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, రాయదుర్గం సీఐ చలపతిరావు, బ్రహ్మసముద్రం ఎస్ఐ రెహమాన్ బుధవారం మీడియాకు వివరించారు. కుందుర్పి మండలం బసాపురం గ్రామానికి చెందిన మాల శ్రీరాములుకు ఎనిమిదేళ్ల క్రితం శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన భాగ్యమ్మ(25)తో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కూతురు లక్ష్మి, రెండేళ్ల కుమారుడు శశిధర్ ఉన్నారు. ఏడాది కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీరాములు రోజూ తప్పతాగి వచ్చి గొడవ పెట్టుకునేవాడు. భర్త పెట్టే హింసను భరించలేక ఆమె నెలరోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఆదివారం శ్రీరాములు తన తల్లితో కలిసి శెట్టూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇక నుంచి భార్యను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సోమవారం భార్యను మెట్టినిల్లు బసాపురం తీసుకొచ్చాడు. అయితే అతని వైఖరిలో ఎటువంటి మార్పూ రాలేదు. మంగళవారం మరోసారి పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో భార్య భాగ్యమ్మతో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయి చాకుతో గొంతు, తలపై పొడిచి చంపి, అక్కడి నుంచి పరారయ్యాడని డీఎస్పీ తెలిపారు. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన పిల్లలు గట్టిగా ఏడ్వడంతో చుట్టుపక్కల వారు వచ్చి, మృతురాలి బంధువులకు సమాచారం అందించారన్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
అక్రమంగా మద్యం విక్రయిస్తోన్న మహిళకు రిమాండ్
ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 19 (20 ఎంఎల్) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వీరభద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఈదిబజార్ కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన భాగ్యమ్మ (54) గుడుంబా వ్యాపారి. గతంలో గుడుంబా వ్యాపారం నిర్వహిస్తూ ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తుంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎసై ్స ప్రసాద్ రావు సంతోష్‌నగర్ ఏసీపీ వి. శ్రీనివాసులు ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు. భాగ్యమ్మ ఇంట్లో సోదాలు చేయగా 19 మద్యం బాటిళ్లు లభించాయి. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని భాగ్యమ్మైపై ఎకై ్సజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుడుంబా విక్రయాలు కొనసాగించి పలుమార్లు భాగ్యమ్మ జైలుకు వెళ్లి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. 200 ఎంఎల్ మద్యం బాటిళ్లు రూ.60 లకు తీసుకొచ్చి రూ.70 విక్రయిస్తుంది. -
మరణంలోనూ వీడని బంధం
కరీంనగర్ రూరల్ : మరణంలోనూ తాము ఒక్కటేనంటూ ఆ దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వివరాలివీ...కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి పంచాయతీ హన్మాన్నగర్లో నివసిస్తున్న కల్వల రాజయ్య(70) నగరంలోని ఎస్బీఐలో తాత్కాలిక వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు రాజయ్య చనిపోయాడు. అది తట్టుకోలేని భాగ్యమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 8గంటలకు మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
భర్తను కడతేర్చిన భార్య అరెస్టు
ప్రియుడితో కలిసికట్టుకున్న భర్తనుఅతి కిరాతకంగా హతమార్చిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం దొడ్డలోనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి మైబు(39) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యను హింసిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన భార్య భాగ్యమ్మ ప్రియుడు కొంకి సునిల్‌తో కలిసి పథకం పన్నింది. వారం క్రితం మైబు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి కత్తులతో దాడి చేసి అతన్ని కడతే ర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి భార్యే హత్య చేసిందని గుర్తించి ఆమెతో పాటు హత్యలో ఆమెకు సాయం చేసిన ప్రియుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
నల్లగొండ జిల్లా జిల్లా చింతపల్లి మండలం ఉమాంతాలపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.భాగ్యమ్మ(32) అనే వివాహిత రోడ్డుపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వివాహితపై అత్యాచారం.. హత్య
చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ పరిధిలోని పైరాసిపెంట గ్రామ పొలాల్లో ఓ వివాహిత అత్యాచారం, హత్యకు గురైంది. మృతదేహం దెబ్బతిన్న పరిస్థితుల్లో ఉండగా ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు .. మృతురాలు.. పైరాసిపెంటకు చెందిన భాగ్యమ్మ (29)గా గుర్తించారు. చౌడేపల్లి మండలం మర్రిమాకులపల్లిలోని తల్లిగారింటికి వెళ్లిన ఆమె నాలుగు రోజుల క్రితం పైరాసిపెంటకు బయల్దేరగా... ఆమెకు సన్నిహితంగా ఉండే రెడ్డి రాజశేఖర్ ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని...
మండ్య: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చిన దారుణం మండ్య తాలూకాలోని గణిగ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గణిగ గ్రామానికి చెందిన జి.కె.కృష్టేగౌడ, భాగ్యమ్మ(30) దంపతులు. 13 సంవత్సరాల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా తాగుడుకు అలవాటు పడ్డ కృష్ణేగౌడ పనిలోకి వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. తా గుడుకు డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం భార్యను కొట్టి వేధించేవాడు. కుటుం బ పోషణకు కూలీ పనులకు వెళుతున్న భాగ్యమ్మ బుధవారం రాత్రి అదమరిచి నిద్రించింది. గురువారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కృష్ణేగౌడ తన భార్యను లేపి డబ్బు కావాలని అడిగాడు. ఆ సమయంలో తన వద్ద డబ్బు లేదని ఆమె తెలిపడంతో చాలా సేపు గొడవ చేశాడు. అనంతరం అక్కడే ఉన్న కొడవలితో ఆమెను నరికి హతమార్చాడు. కొద్ది సేపటి తర్వాత మత్తు నుంచి బయటపడిన అతను పోలీసులకు లొంగిపోయాడు. తాను ఇంటిలో లేని సమయంలో పరాయి వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంటోందని, ఈ విషయంలో గొడవ జరిగి తాను హత్య చేసినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు. ఘటనా స్థలాన్ని పీఎస్ఐ శివరుద్రప్ప పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఇంటికప్పు కూలి దంపతుల దుర్మరణం
సిద్దవటం: వివాహబంధంతో ఒక్కటైన వారు మరణంలోనూ ఒక్కటై వెళ్లిపోయారు. సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున నివాస గృహం పైకప్పు(స్లాబు) కూలి ఎన్నంరెడ్డి సుబ్బారెడ్డి(65), భాగ్యమ్మ(58) అనే దంపతులు దుర్మరణం చెందారు. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీగా భాగ్యమ్మ పని చేస్తోంది. ఈమె భర్త సుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకునేవారు. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా పైకప్పు స్లాబు విరిగి నిద్రిస్తున్న వారిపై కూలింది. దీంతో సుబ్బారెడ్డి శిధిలాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను చికిత్స నిమిత్తం 108వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి కొద్దిసేపటికే భాగ్యమ్మ కూడా కన్నుమూసింది. రోజూ తెల్లవారుజామున 4గంటలకే నిద్రలేచే వారని, వర్షం కురుస్తుండటంతో సోమవారం నిద్రలేవలేదని, ఇంతలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ అన్సర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం కోసం సుబ్బారెడ్డి మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు రిమ్స్‌లో మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
వేధిస్తున్న మహిళా వైద్యుల కొరత
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జిల్లా ఆస్పత్రి పేదలకు దూరమవుతోంది. కాన్పుల కోసం ఇక్కడ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ తగిన డాక్టర్లు లేకపోవడంతో నిరుపయోగంగా మారుతోంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రతి కేసును కడప రిమ్స్‌కు పంపిస్తున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి వుంది. స్థానిక ప్రజలతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం,దువ్వూరు, మైదుకూరు, కమలాపురం మండలాలకు చెందిన వారు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. గతంలో ఇక్కడ ఐదు మంది మహిళా వైద్యులు ఉండేవారు. పగలు ఓపితో పాటు 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండేవారు. అంతేగాక కాన్పుల వార్డులో ప్రతి రోజూ ఒక డాక్టర్ విధులు నిర్వహించేవారు. గర్భిణీలతో పాటు బాలింతలకు మెరుగైన వైద్యం లభించేది. అయితే ముగ్గురు సెలవులో ఉండగా ఒక డాక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో భాగ్యమ్మ అనే డాక్టర్ మాత్రమే నాలుగైదు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఒకరే డాక్టర్ కావడంతో పగలు ఓపీతో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆస్పత్రికి వచ్చే కాన్పుల కేసులను చూడటానికి డాక్టర్ లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సులే దిక్కు.. ఆస్పత్రిలోని కాన్పుల విభాగంలో రాత్రి సమయాల్లో డాక్టర్లు లేకపోవడంతో నర్సులే దిక్కవుతున్నారు. మొదటి సారి సాధారణ ప్రసవం జరిగి తిరిగి రెండో కాన్పు కోసం వచ్చిన మహిళలను మాత్రం ఇక్కడి నర్సులు చేర్పించుకుంటున్నారు. మొదటి కాన్పు కోసం వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తతో కడప రిమ్స్‌కు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. డాక్టర్ లేరని చెప్పకుండా బీపీ ఎక్కువగా ఉందనో, బిడ్డ ఉమ్మునీరు తాగిందని చెప్పుతుండటంతో ఆందోళన చెంది వేరే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఆస్పత్రిలో మహిళా డాక్టర్ల కొరత ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ఒకరిద్దరైనా వస్తారనే ఆశాభావం ఉంది. అప్పటి వరకు ఉన్న డాక్టర్తోనే సర్దుకుని పోవాల్సిందే. - ఎస్.ఎన్.మూర్తి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్