రొళ్ల : ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న తల్లిదండ్రులు గంటల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచిపెట్టడంతో ఆ కుటుంబం కకావికలమైంది. వివరాల్లోకి వెళితే... రొళ్ల మండలం హుణిసేకుంటకు చెందిన గోవిందప్ప, భార్య భాగ్యమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గోవిందప్ప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించా నయంకాలేదు. రెండు రోజుల క్రితం గోవిందప్ప (42) ఇంటి వద్దే చనిపోయాడు. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో మనో వేదనకు గురైన భాగ్యమ్మ (35) కూడా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది.
దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. వారి సమాధులను కూడా పక్క పక్కనే పూడ్చిపెట్టారు. తల్లిదండ్రులిద్దరినీ ఒకే సారి కోల్పోవడంతో వారిద్దరి కుమారులు, కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అనాథలైన వారికి అండగా ఉంటామని గ్రామస్తులు చెప్పారు. వారంతా కలిసే అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
గంటల వ్యవధిలోనే దంపతుల మృతి
Published Sun, Mar 19 2017 11:36 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement