కరీంనగర్ రూరల్ : మరణంలోనూ తాము ఒక్కటేనంటూ ఆ దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందారు. వివరాలివీ...కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి పంచాయతీ హన్మాన్‌నగర్‌లో నివసిస్తున్న కల్వల రాజయ్య(70) నగరంలోని ఎస్‌బీఐలో తాత్కాలిక వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు.
బుధవారం మధ్యాహ్నం 3గంటలకు రాజయ్య చనిపోయాడు. అది తట్టుకోలేని భాగ్యమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 8గంటలకు మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరణంలోనూ వీడని బంధం
Published Thu, Jul 28 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
Advertisement
Advertisement