భర్తను కడతేర్చిన భార్య అరెస్టు | wife who killed her Husband is arrested | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య అరెస్టు

Published Mon, Feb 29 2016 6:16 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

wife who killed her Husband is arrested

ప్రియుడితో కలిసికట్టుకున్న భర్తనుఅతి కిరాతకంగా హతమార్చిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం దొడ్డలోనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి మైబు(39) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్యను హింసిస్తున్నాడు.

దీంతో విసిగిపోయిన భార్య భాగ్యమ్మ ప్రియుడు కొంకి సునిల్‌తో కలిసి పథకం పన్నింది. వారం క్రితం మైబు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి కత్తులతో దాడి చేసి అతన్ని కడతే ర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి భార్యే హత్య చేసిందని గుర్తించి ఆమెతో పాటు హత్యలో ఆమెకు సాయం చేసిన ప్రియుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement