మద్యానికి డబ్బులు ఇవ్వలేదని... | Alcohol and did not pay the money | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని...

Published Fri, Feb 20 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

Alcohol and did not pay the money

మండ్య: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చిన దారుణం మండ్య తాలూకాలోని గణిగ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గణిగ గ్రామానికి చెందిన జి.కె.కృష్టేగౌడ, భాగ్యమ్మ(30) దంపతులు. 13 సంవత్సరాల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా తాగుడుకు అలవాటు పడ్డ కృష్ణేగౌడ పనిలోకి వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. తా గుడుకు డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం భార్యను కొట్టి వేధించేవాడు. కుటుం బ పోషణకు కూలీ పనులకు వెళుతున్న భాగ్యమ్మ బుధవారం రాత్రి అదమరిచి నిద్రించింది. గురువారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కృష్ణేగౌడ తన భార్యను లేపి డబ్బు కావాలని అడిగాడు.

ఆ సమయంలో తన వద్ద డబ్బు లేదని ఆమె తెలిపడంతో చాలా సేపు గొడవ చేశాడు. అనంతరం అక్కడే ఉన్న కొడవలితో ఆమెను నరికి హతమార్చాడు. కొద్ది సేపటి తర్వాత మత్తు నుంచి బయటపడిన అతను పోలీసులకు లొంగిపోయాడు. తాను ఇంటిలో లేని సమయంలో పరాయి వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంటోందని, ఈ విషయంలో గొడవ జరిగి తాను హత్య చేసినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు. ఘటనా స్థలాన్ని పీఎస్‌ఐ శివరుద్రప్ప పరిశీలించి కేసు నమోదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement