సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో 49,903 పింఛన్లకు కోత పడనుంది. ప్రభుత్వం చేపట్టిన లెఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారంతో ముగియడం నిజమైన పింఛన్‌దారుల లెక్కతేల నుంది. 36,512మంది వెరిఫికేషన్ చేయించుకోకపోగా, వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్నా వేలిముద్రలు సరిపోలకపోవడం, ఆధార్‌తో లింకు కలువని 11,392 మందికి పింఛన్లు నిలిచిపోనున్నాయి. ఆధార్ లింకు మ్యాచ్ కాని వా రు మళ్లీ కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు వీరికి పిం ఛన్ నిలిపివేయనున్నారు.
దీంతో జిల్లా లో వ్యాప్తంగా 49,903 మందికి ఆసరా పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. పింఛన్లు రద్దయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట్ మండలంలో 3,466, అమీర్‌పేట్‌లో 496, ఆసీఫ్‌నగర్‌లో 6,135,బహుదూర్‌పురాలో 4,914, బండ్లగూడలో 6,370 ,చార్మినార్‌లో 2,591, గొల్కోండలో 1715, హిమాయత్‌నగర్‌లో 1641,ఖైరతాబాద్‌లో 3337, మారేడుపల్లిలో1880, ముషీరాబాద్‌లో 2988, సైదాబాద్‌లో 2062 , సికింద్రాబాద్‌లో 2351, తిరుమలగిరిలో 1900, షేక్‌పేట్‌లో 2088, నాంపల్లి మండలంలో 3951 పింఛన్లు రద్దుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.