ఫిర్యాదులను స్వీకరిస్తున్న సీపీ మహేష్ భగవత్
నాగోలు: ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా వేధిస్తే సైబరాబాద్ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ ఈస్ట్‌జోన్ కమిషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు. ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లోని క్యాంపు కార్యాలయంలో సీపీ మంగళవారం ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
సైబరాబాద్ పరిధిలో మహిళల రక్షణ కోసం షి–టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. నయీమ్‌కు సంబంధించిన కేసును సిట్ దర్యాప్తు చేస్తుందని, బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే సిట్‌కు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం ఎల్‌బీనగర్‌లో అందుబాటులో ఉంటానని, ప్రతి శుక్రవారం నేరేడ్‌మెట్ డీసీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. బాధితులు తమ ఫిర్యాదులను 9490617111 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చని కోరారు.