రూ.500లతో ఐఏఎస్‌ల పెళ్లి
-
నిరాడంబరంగా విజయవాడ సబ్ కలెక్టర్ సలోని వివాహం
విజయవాడ : కేవలం రూ.500లకే పెళ్లి జరిగిపోయింది. ఏంటి మరీ నిరుపేద కుటుంబంలో పెళ్లి కాబోలు అనుకుంటున్నారట..కాదండి నెలకు దంపతులిద్దరి జీతం కలిపి ఐదంకెలు ఉంటుంది. అబ్బో అయితే అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలి కదా అనే కదా మీ అనుమానం..అందరూ ఒకలా ఉండరండి..వీరు ఆదర్శ దంపతులు. అందుకే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. వృథా ఖర్చులకు మంగళం పాడారు. ఈ యువ జంటే విజయవాడ సబ్ కలెక్టర్ సలోని సిదాన, మధ్యప్రదేశలోని గోహడ సబ్ డివిజనల్ మేజిసే్ట్రట్ (సబ్ కలెక్టర్) ఆశిష్ వశిష్ట. వీరిద్దరూ ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 2013లో ఐఏఎస్ పూర్తి చేశారు. ఇరు కుటుంబాల సభ్యులతో కలిసి వారు నిరాడంబరంగా నవంబర్ 28న వివాహం చేసుకున్నారు. వివాహ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించకపోవటం గమనార్హం. వివాహం జరిగిన రెండో రోజు సాయంత్రమే వారిద్దరూ తమ ఉద్యోగ విధుల్లో జాయిన్ అయ్యారు.