ఐఏఎస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనది
ఐఏఎస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనది
బాపట్లలో ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్షణ
ఐఏఎస్, ఉద్యోగులు, శిక్షణ
IAS, Job, Training
Ias employees training in bapatla
బాపట్ల (గుంటూరు): ఐఏఎస్ ఉద్యోగం ఎంతో బాధ్యత కలిగిన ఉద్యోగమని రిటైర్డు ఐఏఎస్ అధికారి రామయ్య అన్నారు. ఐఏఎస్‌కు ఎంపికైన ఐదుగురికి బాపట్ల ‘అపార్టు’ సంస్థలో నెల రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామయ్య భూ రికార్డుల నిర్వహణ, ఆఫీసు నిర్వహణ, ప్రకతి వైపరీత్యాల సందర్భంగా వచ్చే ప్రమాదాలపై వివరించారు. ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఐఏఎస్ అధికారి ఉద్యోగంలో ఎంతో బాధ్యత దాగి ఉందని తెలిపారు. భూ పరిపాలన, ధోరణి, భూముల సంస్కరణలు, భూమి కేటాయింపు, పీఈటీæ చట్టం, ఏపీ రెవెన్యూ రికవరీ చట్టం, ఆర్‌వోఆర్ చట్టం, విభాగం సహా ప్రభుత్వ భూమి రక్షణ, అద్దె చట్టాలపై అవగాహన కల్పించారు. శిక్షణ పొందుతున్నవారిలో అభిషేక్ కిషోర్, బాలాజీ, వినోద్‌కుమార్, సాయికాంత్‌వర్మ, నరేంద్రప్రసాద్ ఉన్నారు.