ఐజీ ఆకస్మిక తనిఖీ
నంద్యాల: రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, చోరీల రికవరీ సరిగ్గా లేకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు కేసుల్లో ఉన్న వాహనాలు తుప్పు పడుతున్నాయని, వాటిని తరలించాలని ఆదేశించారు. ఆయనతో పాటు డీఐజీ రమణకుమార్, డీఎస్పీ హరినాథరెడ్డి ఉన్నారు.