అందుకే పోటీ చేయలేకపోయా: వివేక్
హైదరాబాద్ : తనకు పెద్దపల్లి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం కారణంగానే వరంగల్ ఉప ఎన్నిక బరిలో దిగలేకపోయానని కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ అన్నారు. వరంగల్ నుంచి తనను పోటీ చేయాలన్న కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ టికెట్ లభించిన రాజయ్యకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని వివేక్ తెలిపారు. కాగా వివేక్ ను బరిలోకి దించేందుకు అధిష్టానం ప్రయత్నించినా, ఆయన మాత్రం మొదటి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీంతో రాజయ్యకు లైన్ క్లియర్ అయింది.