ఆదాయ పన్ను రిటర్న్‌లు ఇచ్చింది 5 కోట్ల మందే | incom tax paid 5cr people only | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను రిటర్న్‌లు ఇచ్చింది 5 కోట్ల మందే

Published Fri, Aug 5 2016 12:12 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

incom tax paid  5cr people only

ప్రిన్సిపల్‌ కమిషనర్‌ –2 ఓంకారేశ్వర్‌ చిదరా
అనకాపల్లి టౌన్‌: భారతదేశంలో 20  కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్న్‌లు ఇ వ్వాల్సి ఉండగా కేవలం ఐదుకోట్ల మంది మాత్రమే  ఇస్తున్నట్టు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఇన్‌కంట్యాక్స్‌ –2 ఓంకారేశ్వర్‌ చిదరా తెలిపారు. స్థానిక ఉప్పల చంద్రశేఖర్‌ కల్యాణమండపంలో  చార్టెడ్‌అకౌంట్స్‌ బంగారుశెట్టి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో చిదరా మాట్లాడారు. భారత ప్రభుత్వం ఇన్‌కాం డిక్లరైజేషన్‌ పథకం సెప్టెంబర్‌ 30 వరకు ఉందన్నారు. దీనిని పొడిగించేందుకు వీలు కాదని పార్లమెంట్‌లో తీర్మానం చేసినట్టు చెప్పారు. గతంలో కట్టాల్సిన ట్యాక్స్‌కి 30 నుంచి 40 శాతం పెంచిందన్నారు. రెండు, మూడేళ్లలో కట్టాల్సిన ట్యాక్స్‌ను వడ్డీలేకుండా మూడు విధాలుగా చెల్లించే విధంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. అనకాపల్లిలో ట్యాక్స్‌ల రూపంలో నగదు జమ అయ్యేదని తెలిపారు.  ప్రస్తుతం ఎందువల్లో తగ్గిందన్నారు. ఇప్పటి వరకు 25 కోట్లు  మందికి పాన్‌కార్డులు, వందకోట్ల మందికి ఆధార్‌కార్డులు ఉన్నందున ఈ రెండింటినీ అనుసంధానం చేయడంతో ట్యాక్స్‌ పరిధిలోకి ఎంత మంది వస్తారో తెలుస్తుందని తెలిపారు.  ఒకరోజు దాడులు చేయడం వల్ల ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయ లు ట్యాక్స్‌ వసూలైనట్టు వివరించారు. అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంట్యాక్స్‌ కాకినాడ రేంజ్‌ ఎస్‌.రవిశంకర్‌నారాయణ మాట్లాడుతూ ఆస్తుల డేటాలు కంప్యూటర్‌లో నమోదు కావడం వల్ల ట్యాక్స్‌ పరిధిలోకి ఎవరు వస్తున్నదీ గమనించినట్టు తెలిపారు. అనంతరం చదరాను చార్టెడ్‌ అకౌంటెంట్లు ఘనంగా సన్మానించారు. వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ, అధ్యక్షులు కోరుకొండ శరత్‌బాబు, వివిధ వర్గాలకు చెందిన వర్తకులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement