ఆగిన ఇందిర జలప్రభ | Indira jalaprabha stopping | Sakshi
Sakshi News home page

ఆగిన ఇందిర జలప్రభ

Published Sun, Oct 2 2016 5:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

పొచమ్మరాల్‌ గిరిజన తండాలో ఓ రైతు పొలంలో నిరుపయోగంగా బోరు

పొచమ్మరాల్‌ గిరిజన తండాలో ఓ రైతు పొలంలో నిరుపయోగంగా బోరు

మళ్లీ మూలనపడ్డ పోడు భూములు
బోర్లు తవ్వి ఏళ్లు గడుస్తున్నా మోటార్లు బిగించని వైనం  
ఆందోళనలో హరిజన, గిరిజన రైతులు

మెదక్‌: సారూ...మా భూమిలో యేడాది క్రితంఇందిర జలప్రభ పథంలో  బోరు తవ్వారు. అందుకు సంబంధించిన మోటర్‌కు కూడా ఇచ్చారు. కాని పైపులు ఇవ్వడం లేదు. కరెంట్‌ వైర్లు లాగడం లేదు. మోటర్లు ఇచ్చి ఐదు నెలలు గడుస్తుండటంతోవృధాగా ఉంది. పది ఎకరాల భూమి బీడుగానే ఉంది. అంటూ మెదక్‌ మండల పరిధిలోని పొచమ్మరాల్‌ గిరిజన తండాకు చెందిన కెతావత్‌ చందర్‌ వాపోయారు.

ఇందిర జలప్రభ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో జిల్లాలో చందర్‌లాంటి వేలాది మంది రైతుల భూములు బీళ్లుగానే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు  సంబంధించిన  భూముల్లో బోర్లు తవ్వించి బోరు మోటర్‌తోపాటు కరెంట్‌లైన్‌ వేసి వారి అభివృద్ధికోసం 2012లో అప్పటి ప్రభుత్వం ఇందిరజలప్రభ పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఇందులో ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి పదెకరాల భూములను గుర్తించి అందులో ఎంతమంది రైతులున్నా వారి అభివృద్ధికోసం ప్రభుత్వం బోరు తవ్వించడం, పంపుసెట్లు అమర్చడం, విద్యుత్‌లైన్‌ లాగి వారికి అప్పగించారు. దీంతో ఎంతోమంది నిరుపేద ఎస్టీఎస్టీలు వ్యవసాయం చేసుకుంటున్నారు.

కాగా గత ఆరు మాసాల క్రితం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇందిర జలప్రభ పథకాన్ని తొలగించి, ఎస్సీ,ఎస్టీ కార్పోరేషన్‌కు అనుసంధానం చేసింది. ఇప్పటికే కొంతమంది భూముల్లో బోరు బావులు తవ్వి, పంపుసెట్లు అమర్చకుండా, కరెంట్‌లైన్‌ వేయకుండా వదిలేశారు. దీంతో వేలాది మంది గత ఆరునెలలుగా నిరాశ నిష్ప ృహలకు గురవుతున్నారు.

అందరిలాగా తాము వ్యవసాయం చేసుకుందామంటే అర్ధంతరంగా బోర్లు తవ్వి వదిలేశారని, దీంతో తమ భూములు బీళ్లుగానే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఇందిర జల ప్రభ పథకాన్ని ప్రవేశ పెట్టి నాబార్డు నిధులను మళ్లించి జిల్లాలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధికి కృషి చేశారు.

కాగా ఇందుకు సంబంధించి కొంతమంది బోరు మోటర్లు అందించగా, మరికొంతమంది పొలాల్లోS బోర్లు వేసి వదిలేశారు. జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో ఇప్పటి వరకు సుమారు 4560 బోరు బావులు తవ్వించగా, అందులో 2200 బోరుబావుల్లో పంపుసెట్లు బిగించారు. ఇందుకుగానూ 1500పై చిలుకు ఎస్సీ, ఎస్టీ రైతులు లబ్దిపొందినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరో 1500పైచిలుకు బ్యాలెన్స్‌ పనులను అలాగే వదిలేయడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమ పొలాల్లో మోటర్లు బిగించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

బోరుతవ్వించి వదిలేశారు
సార్‌ మా వ్యవసాయ పొలంలో బోరుతవ్వించి ఆరు నెలలు గడుస్తుంది. పంపుసెట్టు కూడా ఇచ్చారు. కాని పైపులు ఇవ్వడం లేదు, విద్యుత్‌లైన్‌ వేయడం లేదు. మాతోటి వారందరికి బోర్లు తవ్వించి పంపుసెట్టు కూడా బిగించారు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. మా భూములు మాత్రం బీళ్లుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి పైప్‌లుఅందించి, విద్యుత్‌లైన్‌ లాగి ఆదుకోగలరు. - మెగావత్‌రవి, పొచమ్మరాల్‌ తండా.

అధికారి వివరణ
ఈ విషయంపై డ్వాకా ఏఓ కె.విద్యాసాగర్‌రావును సాక్షి వివరణ కోరగా, గత ఆరు మాసాల క్రితమే ఇందిర జలప్రభ పథకాన్ని నిలిపివేయడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న పనులను ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌లకు అప్పగించడం జరిగింది. నిధులు రాగానే మిగతా పనులు పూర్తిచేస్తాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement