Indira jalaprabha
-
ఆగిన ఇందిర జలప్రభ
మళ్లీ మూలనపడ్డ పోడు భూములు బోర్లు తవ్వి ఏళ్లు గడుస్తున్నా మోటార్లు బిగించని వైనం ఆందోళనలో హరిజన, గిరిజన రైతులు మెదక్: సారూ...మా భూమిలో యేడాది క్రితంఇందిర జలప్రభ పథంలో బోరు తవ్వారు. అందుకు సంబంధించిన మోటర్‌కు కూడా ఇచ్చారు. కాని పైపులు ఇవ్వడం లేదు. కరెంట్ వైర్లు లాగడం లేదు. మోటర్లు ఇచ్చి ఐదు నెలలు గడుస్తుండటంతోవృధాగా ఉంది. పది ఎకరాల భూమి బీడుగానే ఉంది. అంటూ మెదక్ మండల పరిధిలోని పొచమ్మరాల్ గిరిజన తండాకు చెందిన కెతావత్ చందర్ వాపోయారు. ఇందిర జలప్రభ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో జిల్లాలో చందర్లాంటి వేలాది మంది రైతుల భూములు బీళ్లుగానే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల్లో బోర్లు తవ్వించి బోరు మోటర్‌తోపాటు కరెంట్‌లైన్ వేసి వారి అభివృద్ధికోసం 2012లో అప్పటి ప్రభుత్వం ఇందిరజలప్రభ పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి పదెకరాల భూములను గుర్తించి అందులో ఎంతమంది రైతులున్నా వారి అభివృద్ధికోసం ప్రభుత్వం బోరు తవ్వించడం, పంపుసెట్లు అమర్చడం, విద్యుత్‌లైన్ లాగి వారికి అప్పగించారు. దీంతో ఎంతోమంది నిరుపేద ఎస్టీఎస్టీలు వ్యవసాయం చేసుకుంటున్నారు. కాగా గత ఆరు మాసాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిర జలప్రభ పథకాన్ని తొలగించి, ఎస్సీ,ఎస్టీ కార్పోరేషన్‌కు అనుసంధానం చేసింది. ఇప్పటికే కొంతమంది భూముల్లో బోరు బావులు తవ్వి, పంపుసెట్లు అమర్చకుండా, కరెంట్‌లైన్ వేయకుండా వదిలేశారు. దీంతో వేలాది మంది గత ఆరునెలలుగా నిరాశ నిష్ప ృహలకు గురవుతున్నారు. అందరిలాగా తాము వ్యవసాయం చేసుకుందామంటే అర్ధంతరంగా బోర్లు తవ్వి వదిలేశారని, దీంతో తమ భూములు బీళ్లుగానే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర జల ప్రభ పథకాన్ని ప్రవేశ పెట్టి నాబార్డు నిధులను మళ్లించి జిల్లాలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధికి కృషి చేశారు. కాగా ఇందుకు సంబంధించి కొంతమంది బోరు మోటర్లు అందించగా, మరికొంతమంది పొలాల్లోS బోర్లు వేసి వదిలేశారు. జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో ఇప్పటి వరకు సుమారు 4560 బోరు బావులు తవ్వించగా, అందులో 2200 బోరుబావుల్లో పంపుసెట్లు బిగించారు. ఇందుకుగానూ 1500పై చిలుకు ఎస్సీ, ఎస్టీ రైతులు లబ్దిపొందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 1500పైచిలుకు బ్యాలెన్స్ పనులను అలాగే వదిలేయడంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమ పొలాల్లో మోటర్లు బిగించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బోరుతవ్వించి వదిలేశారు సార్ మా వ్యవసాయ పొలంలో బోరుతవ్వించి ఆరు నెలలు గడుస్తుంది. పంపుసెట్టు కూడా ఇచ్చారు. కాని పైపులు ఇవ్వడం లేదు, విద్యుత్‌లైన్ వేయడం లేదు. మాతోటి వారందరికి బోర్లు తవ్వించి పంపుసెట్టు కూడా బిగించారు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. మా భూములు మాత్రం బీళ్లుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి పైప్లుఅందించి, విద్యుత్‌లైన్ లాగి ఆదుకోగలరు. - మెగావత్రవి, పొచమ్మరాల్ తండా. అధికారి వివరణ ఈ విషయంపై డ్వాకా ఏఓ కె.విద్యాసాగర్‌రావును సాక్షి వివరణ కోరగా, గత ఆరు మాసాల క్రితమే ఇందిర జలప్రభ పథకాన్ని నిలిపివేయడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న పనులను ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లకు అప్పగించడం జరిగింది. నిధులు రాగానే మిగతా పనులు పూర్తిచేస్తాం. -
ఆందోళనలో ఇందిర జలప్రభ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు నిధులతో చేపట్టే ‘ఇందిర జలప్రభ’ (ఐజేపీ) కార్యక్రమం ముందుకు సాగడం లేదు. రూ.48 కోట్ల వ్యయంతో 20,229 ఎకరాలను సాగులోకి తెచ్చి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాల పరిస్థితి మెరుగుపరచాలనేది దీని లక్ష్యం. మూడేళ్ల కాలంలో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేసి, భూములకు సాగు నీరు అందించేందుకు బోర్లు, కరెంటు, పంపుసెట్లు ఏర్పాటు చేయాలి. మూడేళ్లు కావస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటి వరకు రూ.14.47 కోట్లు ఖర్చు చేసిన అధికారులు కేవలం 613 బోర్లకు మాత్ర మే కరెంటు కనెక్షన్లు ఇచ్చి, 448 బోర్లకు పంపుసెట్లు బిగించారు. దీంతో 290 ఎకరాలు కూడా వినియోగంలో రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన బంజరు, అసైన్డ్ భూములను అభివృద్ధి చేసేందుకు అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆమోదిస్తూ వచ్చింది. మూడేళ్లలో 3,056 బ్లాకులుగా విభజించి, దాదాపు 20,229 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందులో 2,420 బ్లాకులను సర్వేచేసి 1,998 బోర్లు వేయాలని సిఫారసు చేయగా, 1,518 బోర్లు వేసేందుకు పరిపాలనా అనుమతి లభించింది. ఈ మేరకు అధికారులు 2011 నవంబర్ మొదటి వా రం లో టెండర్లు నిర్వహించారు. బోర్వెల్ (డీటీహె చ్) కోసం మీటరుకు రూ.230 చొప్పున 90 మీటర్ల వరకు, ట్యూబ్‌వెల్ కన్స్ట్రక్షన్(రోటరీ) మీటర్‌కు రూ.820 చెల్లించే ందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అధికారులు భూ గర్భ జలాల సర్వే పూర్తి చేసి, బోర్లు వేసే బాధ్యతను అర్హత గల సంస్థలకు అప్పగించారు. ఇప్పటిదాకా నాబార్డు, ఈజీఎస్ కింద 1,518 బోర్లు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 304 బోర్లు ఫెయిల్ కాగా, 1,214 మాత్రమే స క్సెస్ అయ్యాయి. వీటి కింద తక్షణమే భూము లు సాగులోకి తీసుకు రావాల్సి ఉంది. కానీ, మూడేళ్లలో కేవలం 613 బోర్లకే అధికారులు కరెంటు సౌకర్యం కల్పించగలిగారు. 448 బోర్ల కే పంపుసెట్లు బిగిం చారు. ఇంకా 601 మంది ఎస్సీ, ఎస్టీ రైతులు విద్యుత్తు కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లు, పంపుసెట్ల కొనుగోలుపై గందరగోళం భూగర్భ జలాల గుర్తింపు, బోరుబావుల త వ్వకం, కరెంటు కనెక్షన్లు, పంపుసెట్ల ఏర్పాటు పై మొదటి నుంచి గందరగోళమే ఉంది. బోర్‌వెల్స్ కోసం 2011 నవంబర్ 19, 26 తేదీలలో రెండు పర్యాయాలు టెండర్లు నిర్వహించగా, అ గ్రిమెంట్ పూర్తయ్యే సరికి రెండు మాసాలు గడిచింది. బోర్లు వేసేందుకు భూగర్భజల పరీక్షల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడగా, డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక ని యామకాలు చేశారు. 1,518 బోర్లు వేసేందుకు సర్వే పూర్తయినా, 1,214 బోర్లు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా వేయగలిగారు. తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులకు సిఫారసు చేయగా, 613 కనెక్షన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సబ్మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్లు, ఇన్సులేషన్, పీవీసీ పైపులు, మినీ ప్యానెల్ బోర్డు తదితర సామగ్రి కోసం రెండు పర్యాయాలు నిర్వహించిన టెండర్లు కొలిక్కి వ చ్చినా రైతులకు స్పష్టత లేదు. ఐఎస్ఐ-9283, ఐఎస్ఐ-8034 గుర్తింపు పొందిన మోటార్లు, పంపుసెట్లను సరఫరా చేసేందుకు అర్హత గల కాంట్రాక్టర్లను ఎంపిక చేశామంటున్నా, రైతులకు చేరిన మోటార్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బావులు, పర్క్యులేషన్ ట్యాంకులు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటివి అమలుకు నోచుకోలేదు. -
జిల్లాకు దక్కని ప్రాధాన్యం...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం శాసనసభలో రూ.1,00,637.96 కోట్లతో ప్రవేశపెట్టిన 2014-15 వార్షిక బడ్జెట్లో జిల్లాకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. 2013-14 బడ్జెట్లో జిల్లా సాగునీటి పథకాలకు రూ.922 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి రూ.346.90 కోట్లు ఇచ్చారు. ఏడు జిల్లాలకు చెందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.1790 కోట్లు కేటాయించినా జిల్లా వాటా తేల్చలేదు. ఇందిర జలప్రభ, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం... తదితర పథకాలపై పాత కేటాయింపులను ప్రభుత్వం బడ్జెట్లో వల్లె వేసిందని, ప్రధాన అంశాలను పక్కన బెట్టిందన్న చర్చ జరగుతోంది. రహదారులు, మౌళిక వసతుల కల్పనల కోసం బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు చోటు దక్కగా పోగా.. ప్రభుత్వ బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఏడు సాగునీటి పథకాలకు.. అమరులకు.. భారీ ప్రాజెక్టులుగా రెండేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లో రూ.1790 కోట్లు కేటాయించారు. అయితే జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలకు మాత్రం కేటాయింపులు జరగలేదు. గత బడ్జెట్లో ప్రాణహిత-చేవెళ్లకు రూ.1051 కేటాయించిన అప్పటి ప్రభుత్వం పైసా విదిల్చలేదు. 2013-14 బడ్జెట్లో ఎస్సారెస్పీ స్టేజ్-1కు రూ.160 కోట్లు కేటాయించగా ఈసారి రూ.63.40 కోట్లకే సరిపుచ్చారు. లెండి ప్రాజెక్టుకు గతంలో రూ.45 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాకపోయినా.. ఈ సారి రూ.3 కోట్లకే పరిమిత చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. నిజాంసాగర్ ఆధునీకరణ పనుల బడ్జెట్ రూ.180 కోట్ల నుంచి ఈసారికి రూ.69.50 కోట్లకు తగ్గింది. జిల్లా నుంచి కరీంనగర్‌కు విస్తరించిన ఇందిరమ్మ వరద కాల్వ నిర్మాణం కోసం గతంలో రూ.400 కోట్లు కేటాయించి రూ.140 కోట్లే ఖర్చు చేయగా.. ఈ సారి ఆ బడ్జెట్‌ను తగ్గించి రూ.200 కోట్లకు పరిమితం చేశారు. రూ.10 కోట్లున్న చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలకు రూ.1కోటి, అలీసాగర్, గుత్పలకు రూ.12 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్ల నుంచి రూ.8 కోట్లకు బడ్జెట్ కుదించారు. సాగునీటి పథకాలకు అంతంతమాత్రంగానే నిధులు కేటాయించారన్న వాదనలు వినిపిస్తుండగా.. జిల్లాలో 757 చెరువుల మరమ్మతులకు మొదటి విడతగా రూ.200 కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించే అవకాశం ఉందని అధికారపార్టీ నేతలు ఊరడిస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 459 మంది తెలంగాణ అమరవీరులకు రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, జిల్లాకు చెందిన 31 మంది కుటుంబాలకు రూ.3.10 కోట్లు అందనున్నాయి. శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధులు (ఏసీడీపీ) రూ.1కోటి నుంచి రూ.1.50 కోట్లకు పెంచడంతో జిల్లాకు ఇకపై ప్రతి సంవత్సరం అదనంగా రూ.4.50 కోట్లు రానున్నాయి. కేటాయింపులపైనే ఆధారం... ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిపద్దులో జిల్లాకు ప్రత్యక్షంగా చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు ప్రత్యక్షంగా జరగలేదంటున్నారు. మొత్తంగా వైద్య రంగానికి రూ.2,882 కోట్లు కేటాయిస్తే.. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆసుపత్రుల ఊసులేదు. రహదారుల నిర్మాణానికి రూ.800ల కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు అవసరం ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదనలు పంపించారు. 3,169 చెరువులకు గాను 757 చెరువుల ఆధునీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉమ్మడి బడ్జెట్లోనే నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.97 లక్షల ఎకరాలకు సాగునీరు అదనంగా ఇస్తామన్నా.. జిల్లా ప్రాజెక్టుల ప్రస్తావన రాలేదు. 125 గజాల స్థలంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో పేదలకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్న హామీ ఉండగా.. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నియోజకవర్గానికి 250 ఇండ్లకు మించి వచ్చే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన పసుపు పరిశోధన కేంద్ర, చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, గల్ఫ్‌బాధితుల ప్రత్యేక విభాగం, వంగడాల పరిశోధన కేంద్రాలు తదితర హామీలు నెరవేర్చే అంశాలు బడ్జెట్లో కనిపించలేదు. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలిపించిన ఇందూరు జిల్లాకు ప్రభుత్వ బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉంటాయని భావించగా.. ఆ మేరకు ప్రాతినిధ్యం కల్పించలేదంటున్నారు.