సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు నిధులతో చేపట్టే ‘ఇందిర జలప్రభ’ (ఐజేపీ) కార్యక్రమం ముందుకు సాగడం లేదు. రూ.48 కోట్ల వ్యయంతో 20,229 ఎకరాలను సాగులోకి తెచ్చి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాల పరిస్థితి మెరుగుపరచాలనేది దీని లక్ష్యం. మూడేళ్ల కాలంలో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేసి, భూములకు సాగు నీరు అందించేందుకు బోర్లు, కరెంటు, పంపుసెట్లు ఏర్పాటు చేయాలి.
మూడేళ్లు కావస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటి వరకు రూ.14.47 కోట్లు ఖర్చు చేసిన అధికారులు కేవలం 613 బోర్లకు మాత్ర మే కరెంటు కనెక్షన్లు ఇచ్చి, 448 బోర్లకు పంపుసెట్లు బిగించారు. దీంతో 290 ఎకరాలు కూడా వినియోగంలో రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి
ఇందిర జలప్రభ కింద ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు చెందిన బంజరు, అసైన్డ్ భూములను అభివృద్ధి చేసేందుకు అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆమోదిస్తూ వచ్చింది. మూడేళ్లలో 3,056 బ్లాకులుగా విభజించి, దాదాపు 20,229 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందులో 2,420 బ్లాకులను సర్వేచేసి 1,998 బోర్లు వేయాలని సిఫారసు చేయగా, 1,518 బోర్లు వేసేందుకు పరిపాలనా అనుమతి లభించింది. ఈ మేరకు అధికారులు 2011 నవంబర్ మొదటి వా రం లో టెండర్లు నిర్వహించారు.
బోర్‌వెల్ (డీటీహె చ్) కోసం మీటరుకు రూ.230 చొప్పున 90 మీటర్ల వరకు, ట్యూబ్‌వెల్ కన్‌స్ట్రక్షన్(రోటరీ) మీటర్‌కు రూ.820 చెల్లించే ందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అధికారులు భూ గర్భ జలాల సర్వే పూర్తి చేసి, బోర్లు వేసే బాధ్యతను అర్హత గల సంస్థలకు అప్పగించారు. ఇప్పటిదాకా నాబార్డు, ఈజీఎస్ కింద 1,518 బోర్లు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 304 బోర్లు ఫెయిల్ కాగా, 1,214 మాత్రమే స క్సెస్ అయ్యాయి. వీటి కింద తక్షణమే భూము లు సాగులోకి తీసుకు రావాల్సి ఉంది. కానీ, మూడేళ్లలో కేవలం 613 బోర్లకే అధికారులు కరెంటు సౌకర్యం కల్పించగలిగారు. 448 బోర్ల కే పంపుసెట్లు బిగిం చారు. ఇంకా 601 మంది ఎస్‌సీ, ఎస్‌టీ రైతులు విద్యుత్తు కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
విద్యుత్ కనెక్షన్లు, పంపుసెట్ల కొనుగోలుపై గందరగోళం
భూగర్భ జలాల గుర్తింపు, బోరుబావుల త వ్వకం, కరెంటు కనెక్షన్లు, పంపుసెట్ల ఏర్పాటు పై మొదటి నుంచి గందరగోళమే ఉంది. బోర్‌వెల్స్ కోసం 2011 నవంబర్ 19, 26 తేదీలలో రెండు పర్యాయాలు టెండర్లు నిర్వహించగా, అ గ్రిమెంట్ పూర్తయ్యే సరికి రెండు మాసాలు గడిచింది. బోర్లు వేసేందుకు భూగర్భజల పరీక్షల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడగా, డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక ని యామకాలు చేశారు. 1,518 బోర్లు వేసేందుకు సర్వే పూర్తయినా, 1,214 బోర్లు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా వేయగలిగారు.
తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులకు సిఫారసు చేయగా, 613 కనెక్షన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సబ్‌మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్లు, ఇన్సులేషన్, పీవీసీ పైపులు, మినీ ప్యానెల్ బోర్డు తదితర సామగ్రి కోసం రెండు పర్యాయాలు నిర్వహించిన టెండర్లు కొలిక్కి వ చ్చినా రైతులకు స్పష్టత లేదు. ఐఎస్‌ఐ-9283, ఐఎస్‌ఐ-8034 గుర్తింపు పొందిన మోటార్లు, పంపుసెట్లను సరఫరా చేసేందుకు అర్హత గల కాంట్రాక్టర్లను ఎంపిక చేశామంటున్నా, రైతులకు చేరిన మోటార్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బావులు, పర్క్యులేషన్ ట్యాంకులు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటివి అమలుకు నోచుకోలేదు.
ఆందోళనలో ఇందిర జలప్రభ..
Published Mon, Nov 17 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement