మందుల కంపెనీలపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి
Published Tue, Aug 9 2016 12:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
కర్నూలు(హాస్పిటల్): సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని పాటించని మందుల కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాయని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకట్, శ్రీకాంత్ విమర్శించారు. ఆ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద మెడికల్‌రెప్స్ ఒకరోజు నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్, శ్రీకాంత్ మాట్లాడుతూ మెడికల్ రెప్స్‌ను అత్యంత నైపుణ్యం గల కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.25వేలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వమే గుర్తింపుకార్డులు ఇప్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు కల్పించాలని, వేజ్‌బోర్డును ఏర్పాటు చేసి పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. మే డేను సెలవు దినంగా ప్రకటించాలని, జాతీయ త్రిసభ్యకమిటీ సమావేశపరిచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సేల్స్ ప్రమోషన్‌ను పరిశ్రమగా గుర్తించి ఐడీ యాక్ట్ సెక్షన్ 27ను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాధా
కృష్ణ, నాగరాజు, మెడికల్ రెప్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్షావలి, సహాయ కార్యదర్శులు బసవరాజు, రవీంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు మెయిన్, శివరంగ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement