మహిళపై దాడి కేసులో ఇద్దరికి జైలు | inprisonment for Two men | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి కేసులో ఇద్దరికి జైలు

Published Wed, Sep 21 2016 12:25 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

inprisonment for Two men

చెన్నేకొత్తపల్లి: మహిళపై దాడి చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడింది. ఎస్ఐ మహమ్మద్రఫి తెలిపిన వివరాల మేరకు... న్యామద్దెలకు చెందిన లక్ష్మిదేవిని 2013లో గ్రామానికి చెందిన పూజారి నరసింహులు, పూజారి దాసప్పలు దాడి చేసి గాయపరిచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు.
 
మంగళవారం విచార ణ జరిగింది. నేరం రుజువు కావడంతో పూజారి నరసింహులుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా, పూజారి దాసప్పకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ స్పెషల్మెజిస్ట్రేట్పుల్లయ్య తీర్పునిచ్చారు. ఇద్దరినీ ధర్మవరం సబ్జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement