జంతుబలిపై విచారణ | inquiry for animal slatter | Sakshi
Sakshi News home page

జంతుబలిపై విచారణ

Published Sat, Jul 30 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

inquiry for animal slatter

సదాశివపేట: పట్టణంలో దుర్గభావాని జాతర సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన జంతు బలిపై శనివారం సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, ఆర్టీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడి పశువైద్య అధికారి సత్యనారాయణలు దుర్గభవాని మందిరం వద్ద విచారణ జరిపారు. కొందరు వక్తులు జాతరలో జంతుబలి జరిగిందని ఫిర్యాదు చేసినందు వల్ల  విచారణ చేపట్టారు.

జాతర సందర్భంగా జంతు బలి జరిగిందా? లేదా? జంతు బలిని ఎవరు చేశారు? జంతువులను ఇక్కడే బలి చేశారా లేక మరోచోట బలిచేసి ఇక్కడకు తీసుకువచ్చార అని మందిరం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జంతు బలి జరిగినట్లు అధికారుల విచారణలో రుజువైంది. జంతువులను బలి చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఇస్వాక్‌ ఆబ్‌ఖాన్‌, సదాశివపేట ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ గిరి, ఆర్‌ఐ. వీరేశం, వీఆర్‌ఓ నాగరాజులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement