మీ-సేవ కేంద్రాల అక్రమాలపై విచారణ | inquiry on mee seva currucptions | Sakshi
Sakshi News home page

మీ-సేవ కేంద్రాల అక్రమాలపై విచారణ

Published Wed, Dec 28 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

inquiry on mee seva currucptions

 
కర్నూలు (అగ్రికల్చర్‌) : అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మీసేవ కేంద్రాలపై మీసేవా కేంద్రాల పరిపాలన అధికారి వెంకటలక్ష్మి బుధవారం విచారణ చేపట్టారు. ఈనెల 25న సాక్షిలో మీ సేవ.. వారిష్టం.. అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ స్పందించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని.. మీ సేవ కేంద్రాల పరిపాలన అధికారిని ఆదేశించారు. ఈ మేరకు కొత్తబస్టాండు సమీపంలోని యూకాన్‌ షాపేలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి అధిక వసూళ్లపై విచారణ జరిపారు. ఆధార్‌ కార్డు ప్రింట్లు తీసి ఇవ్వడానికి రూ.25 తీసుకోవాల్సి ఉండగా, రూ.100 డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పత్తికొండకు చెందిన మల్లికార్జున స్టేట్‌మెంటును కూడా రికార్డు చేశారు. అదేవిధంగా ప్యాపిలిలోని మీ సేవ కేంద్రం అక్రమ వసూళ్లపై కూడా విచారణ జరపనున్నట్లుగా ఆమె వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement