నిర్లక్ష్యంలో ‘ఇన్‌స్పైర్‌’ | inspire dull in anantapur district | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంలో ‘ఇన్‌స్పైర్‌’

Published Fri, Oct 14 2016 11:37 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నిర్లక్ష్యంలో ‘ఇన్‌స్పైర్‌’ - Sakshi

నిర్లక్ష్యంలో ‘ఇన్‌స్పైర్‌’

♦   జిల్లాకు 833 అవార్డులు మంజూరు
♦   కేవలం 156 మందికి నగదు జమ
♦   ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు
♦   25 నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

అనంతపురం ఎడ్యుకేషన్‌ : విద్యార్థులను భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘ఇన్‌సె్పౖర్‌’ (ఇన్నోవేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫెర్‌షూట్‌ ఫర్‌ ఇన్‌స్పిరీడ్‌ రీసెర్చ్‌)కు 2011లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ సక్తి ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే గ్రామీణ వి ద్యార్థులను సైన్స్‌పట్ల ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోంది. ప్ర యోగాలకు ఉపయోగించే వివిధ వస్తువుల కొనుగోలు కు డబ్బులు ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ. 5 వేలు ఖ ర్చు చేస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వం ఈవిషయం లో వెనుకడుగు వేస్తోంది. పది రోజుల్లో జిల్లాస్థాయి ఇ న్‌సె్పౖర్‌ ప్రారంభం కానుంది. అయినా నేటికీ వందల సంఖ్యలో  విద్యార్థులకు అవార్డు మొత్తం జమ కాలేదు. దీంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

156 మంది విద్యార్థులకు మాత్రమే నగదు జమ
ఈ విద్యా సంవత్సరం (2016–17)లో జిల్లా నుంచి మొత్తం 2,256 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకున్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేయించారు. అయితే వీరిలో 833 మందిని జిల్లాస్థాయి ఇన్‌సె్పౖర్‌కు ఎంపిక చేశారు. అందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వివరాలను అధికారులకు పంపారు. ఒక్కొక్కరికి రూ. 5 వేలు ప్రకారం రూ. 41.65 లక్షలు ప్రభుత్వం నిధులు  కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పటికి కేవలం 156 మంది విద్యార్థుల అకౌంట్లలో మాత్రమే రూ. 5 వేలు చొప్పున జమ చేశారు.

25 నుంచి జిల్లాస్థాయి ఇన్‌సె్పౖర్‌
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి  వి ద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌సె్పౖర్‌) ఈనెల 25, 26, 27 తే దీల్లో అనంతపురంలో నిర్వహించనున్నారు.  ఇప్పటికే వా రి ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఉంటే వాటిద్వారా వివిధ వస్తువులు  కొనుగోలు చేసి ప్రదర్శనకు సన్నద్ధం అవుతారు. జమ అవుతుందో...కాదో కూడా తెలీని పరిస్థితి చాలామంది విద్యార్థులది. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఏం చేయాలో?
చాలా తక్కువమందికి అవా ర్డు మొత్తం జమ అయింది. ఏం చేయాలో మాకూ అర్థం కాలేదు. ఆందోళన చెందుతున్నాం. ఢిల్లీ వారితో కూడా సంప్రదించాం. వారు అదిగో...ఇదిగో అంటున్నారు. మా చేతుల్లో ఏముంది. ఇన్‌ౖస్పైర్‌ తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటిదాకా సుమారు 160 మంది అకౌంట్లలో అవార్డు మొత్తం జమ అయింది. ఎంతమందికి వస్తే వారితోనే ఇన్‌సె్పౖర్‌ ప్రదర్శనలు చేయిస్తాం.          –అంజయ్య, డీఈఓ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement