dull
-
అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లకు స్పందన అంతంతే
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజా వాటాదారులకు అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లలో నామమాత్ర స్పందనే కనిపించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలులో భాగంగా అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను చేపట్టింది. పబ్లిక్ నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ప్రకటించిన ఓపెన్ ఆఫర్లు వారాంతాన(9న) ముగిశాయి. సిమెంట్ దిగ్గజాలు వెల్లడించిన వివరా ల ప్రకారం 4.89 కోట్ల షేర్లకుగాను ఏసీసీ వాటాదారుల నుంచి 40.51 లక్షల షేర్లు మాత్రమే లభించాయి. ఇక అంబుజా సిమెంట్స్ విషయంలో మరింత తీసికట్టుగా కేవలం 6.97 లక్షల షేర్లు టెండర్ అయ్యాయి. కంపెనీ 51.63 కోట్ల షేర్ల కోసం ఆఫర్ ఇచ్చింది. రెండు కంపెనీల ఓపెన్ ఆఫర్లు ఆగస్ట్ 26న ప్రారంభమయ్యాయి. ఏసీసీ షేరుకి రూ. 2,300, అంబుజాకు రూ. 385 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు)డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్ ఆఫర్లు విజయవంతమైతే రూ.31,000కోట్లు వెచ్చించవలసి వచ్చేది. వారాంతాన ఏసీసీ షేరు ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 3 శాతం అధికంగా రూ. 2,365 వద్ద ముగిసింది. అంబుజా సిమెంట్స్ ఆఫర్ ధరకంటే 18 శాతం ప్రీమియంతో రూ. 454 వద్ద స్థిరపడింది. -
అనాసక్తతే సేద్యానికి సవాల్
కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పంజాబ్ సింగ్ సాక్షి, హైదరాబాద్: భూతాపోన్నతి వల్ల వ్యవసాయం అతలాకుతలమవుతోందని, అయితే మన దేశంలో వ్యవసాయంపై పెరు గుతున్న అనాసక్తత భూతాపోన్నతి కన్నా పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి, జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ(ఎన్.ఎ.ఎ.ఎస్.) అధ్యక్షుడు డాక్టర్ పంజాబ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పర్యావరణ అనుకూల సాంకేతికతల ద్వారా వంట నూనెల ఉత్పత్తి పెంపుదల’ అనే అంశంపై గురువారం హైద రాబాద్ రాజేంద్రనగర్‌లో ప్రారంభమైన రెండు రోజుల శాస్త్రవేత్తల జాతీయ స్థాయి మేధోమథనంలో ఆయన మాట్లాడారు. పంట దిగుబడులు పెంచినా గిట్టుబాటు ధర లభించని దుస్థితి వల్ల వ్యవసాయం నుంచి వీలైతే తప్పుకోవాలని 40% రైతులు భావి స్తున్నారన్నారు. వ్యవసాయ పరిశోధనలకు నిధులు అతి తక్కువగా కేటాయిస్తున్నందున శాస్త్రవేత్తల్లోనూ అనాసక్తత నెలకొందన్నారు. నిల్వ సదుపాయాల్లేక రైతులు పొలం గట్లపైనే పంటను అమ్ము కుంటున్నారని, 30% పంట వృథా అవుతోందన్నారు. పత్తి పెరుగుతుందేమో: పార్థసారథి అంచనాలకు అందని రీతిలో వాతావరణం అనూహ్యంగా మారిపోతుండడం పంటల ఉత్పత్తి పెంపుదలకు సవాలుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. ప్రభుత్వం రైతులకు నచ్చజెప్పి 5 లక్షల హెక్టార్ల బీటీ పత్తికి బదులు కంది సాగు చేయిస్తే, ఇప్పుడు దాని ధర పడి పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వచ్చే ఏడాది మళ్లీ పత్తి వైపే ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ సంచాలకుడు డాక్టర్ ఎ. విష్ణువర్థన్‌రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సిద్ధిఖీ, డాక్టర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
‘చిన్న’బోయిన ‘పెద్ద’ పండుగ
‘సంక్రాంతి’పై పెద్దనోట్ల రద్దు ప్రభావం ∙వెలవెలబోతున్న వస్త్ర దుకాణాలు ∙భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు ∙పల్లెల్లో కానరాని సంప్రదాయ శోభ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా ఎవరి రోజువారీ జీవితక్రమం వారికి ఉంటుంది. వారి వారి వృత్తివ్యాపకాలను బట్టి ఆ క్రమంలో ఎవరి నిత్యానుభవాలు వారికి ఉంటాయి. అయితే ఒకేరోజు ఓ జాతి జీవితం మొత్తాన్ని ఉత్తేజభరితంగా మార్చేవి పండుగలే. తెలుగు జాతి జరుపుకొనే పండుగల్లో విలక్షణమైనది.. ‘పెద్ద పండుగ’ అనే పర్యాయపదంతో తన స్థాయిని చాటుకునే సంక్రాంతి. తెలిమంచు పరుచుకునే వేకువలను హరిదాసు కీర్తనలకు వేదికలుగా; వాకిళ్లను నెలముగ్గులు విరిసే పూదోటలుగా; లోగిళ్లను ఆనందపు కొలువులుగా మార్చే సంక్రాంతి ఏటా ‘హేమంతంలో వచ్చే వసంతం’ అని చెప్పొచ్చు. జీవనోపాధి రీత్యా పుట్టినగడ్డలను వీడి, ఎక్కడెక్కడికో వెళ్లిన వారు, స్థిరపడిన వారు.. ధనిక, పేద తేడా లేకుండా... తల్లికోడి రెక్కల సందిట చేరే పిల్లల్లా సొంత ఊళ్లకు చేరే పండుగ సంక్రాంతి. ఏటా జనవరి నెల నడుమన తెలుగుజాతి జరుపుకొనే ‘మూడురోజుల మహోత్సవం’ ఈ ఏడాది కళ తప్పింది. సూర్యోదయానికి ముందే తూరుపున పొడసూపే వెలుగురేకల్లా.. ఏటా ఇప్పటికే ఊరూవాడా పెద్ద పండుగ సందడి కనిపించేది. పెద్దనోట్ల రద్దుతో యావద్భారతంపై పరుచుకున్న క్రీనీడ సంక్రాంతి పైనా పడింది. ఈ నేపథ్యంలో ఆ పరిణామాన్నీ, కళావిహీనంగా మారిన వాతావరణాన్నీ వివరిస్తూ.. ‘సాక్షి’ ఫోకస్.... రిపోర్టింగ్ : పెనుబోతుల విజయ్‌కుమార్, మండపేట మండపేట : తెలుగు వారి సంస్కృతీ సాంప్రదాయాలకు శోభాయమానంగా అద్దం పట్టే సంక్రాంతి ఈ ఏడాది కళ తప్పింది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు వెలవెలబోగా ఆ ప్రభావం ఇప్పుడు పెద్ద పండుగపైనా పడుతోంది. నోట్ల రద్దు జరిగి రెండు నెలలైనా ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో గాడిన పడకపోవడంతో ఆశించిన స్థాయిలో పండుగ అమ్మకాలు లేక వ్యాపారులు అయోమయంలో ఉన్నారు. కొత్తగా ఇంటికి వచ్చే అల్లుళ్లకు కానుకలిచ్చేదెలా అన్న ఆలోచనలో పేద, మధ్యతరగతి కుటుంబాల వారున్నారు. సంక్రాంతి పల్లె వాసుల పండుగ. ప్రధానంగా రైతుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలతో నాలుగు రోజుల పాటు ఆబాలగోపాలాన్ని అలరించే పెద్ద పండుగకు జిల్లాలోని పల్లెలు పెట్టింది పేరు. జిల్లాలో అధికశాతం మంది వ్యవసాయాధారిత కుటుంబాల వారే. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా రైతులు ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో జిల్లాలో వాడవాడలా సంక్రాంతి పండును ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంట చేతికొచ్చిన ఆనందంలో ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పట్టణాలు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా సంక్రాంతికి స్వస్థలాలకు తిరిగిరావడం పరిపాటి. పితృదేవతలను గుర్తుచేసుకుంటూ వారికి తర్పణాలు ఇవ్వడంతో పాటు వారి పేరుమీద దుస్తులు, బియ్యం పంపిణీ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడాదిపాటు తమకు సేవలందించిన కులవృత్తుల వారికి యజమానులు ధాన్యం, నగదు రూపంలో కానుకలు అందజేస్తారు. తమకు పాడినిచ్చే పశువులకు పూజలు నిర్వహించడం, గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ధనుర్మాసం ప్రారంభం నుంచే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. తెలతెలవారుతూనే హరినామ సంకీర్తనలతో హరిదాసులు, ఇంటి ముంగిళ్లను ముత్యాల ముగ్గులతో తీర్చిదిద్దే పల్లెపడుచులు, డూడూ బసవన్నలు చేసే విన్యాసాలు, ‘పప్పుదాకలో పడిపోతున్నా’నంటూ కూనిరాగాలు తీసే కొమ్మదాసులు, ఏడాదికోమారంటూ సంక్రాంతి కళాకారులు చేసే సందడి, ‘ఎప్పుడెప్పుడు పండుగా ఏడాది పండుగ’ అంటూ భోగిమంటలకు పిడకల వేటలో చిన్నారుల కోలాహలం ఇవన్నీ సంక్రాంతి శోభలో ఒక భాగమైతే.. సంక్రాంతిని పురస్కరించుకుని ఇళ్లకు బూజులు దులిపి పెయింటింగ్స్ వేయించడం మొదలు ఇంటికి వచ్చే బంధువుల కోసం పిండి వంటల తయారీ, నూతన వస్రా్తల కొనుగోలు, తమతమ ఇళ్లు, పొలాలు తదితర వాటిలో పనిచేసే సిబ్బందికి వస్రా్తలు, సంక్రాంతి కానుకలు అందజేయడం వంటివన్నీ ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఉంటాయి. కొత్తగా పెళ్లిళ్లు జరిగిన ఇళ్లల్లో సంక్రాంతి సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వచ్చే అల్లుడికి బంగారం, వస్తు రూపంలో పండుగ కానుక అందజేయడం ఆనవాయితీ. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు మేర వాణిజ్యం జరుగుతుంటుంది. ఏడాదిలో 11 నెలలు జరిగే వ్యాపారం ఒకటైతే క్రిస్మస్ నుంచి సంక్రాంతి పండుగ వరకు జరిగే వ్యాపారం ఒక ఎత్తని వ్యాపారవర్గాలంటున్నాయి. కానుకలిచ్చేదెలా ? కొత్తగా పెళ్లిళ్లు జరిగిన పేద, మధ్యతరగతి కుటుంంబాల్లో అత్తమామల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నోట్ల రద్దుతో కిందమీద పడి పెళ్లి చేస్తే ఇప్పుడు ఇంటికొచ్చే కొత్త అల్లుడికి కానుక ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్నారు. పెళ్లయిన తర్వాత తొలిసారి పండుగకు వచ్చే అల్లుళ్లకు బంగారం, వాహన రూపాల్లో కానుకలు ఇవ్వడం పరిపాటి. ధాన్యం డబ్బులు చేతికందక కానుకలిచ్చేదెలాగని రైతువర్గాల వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా సంక్రాంతి సీజ¯ŒSలో కోట్లాది రూపాయలు మేర బంగారం అమ్మకాలు జరిగేవి. వినియోగదారులతో కిటకిటలాడే జ్యూయలరీ షాపులు ఈసారి అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. 25 శాతం కూడా జరగని వ్యాపారం పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఇప్పటికే క్రిస్మస్, నూతన సంవత్సర వ్యాపారం చాలా వరకు తగ్గిపోయింది. ఆయా పండుగల సందర్భంగా జిల్లాలో వాణిజ్య కేంద్రాలైన రాజమహేంద్రవరం, కాకినాడలతో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, తుని, పెద్దాపురం తదితర పట్టణాల్లో ఏటా జరిగే వ్యాపారంతో పోలిస్తే 25 శాతం మేర వ్యాపారం కూడా జరగలేదు. వస్త్ర వ్యాపారంతో పాటు పెద్ద ఎత్తున టీవీలు, ఫ్రిజ్‌లు తదితర విద్యుత్ గృహోపకరణాలు, సెల్ఫోన్లు అమ్మే వారు రకరకాల ఆఫర్లతో ముందుకు వస్తుంటారు. ఏటా ఈ సీజ¯ŒSలో జనంతో కిక్కిరిసి ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య కూడళ్లు, రోడ్లు ఇప్పుడు అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. పెద్ద పండుగపై గంపెడాశలు పెట్టుకుంటే ఇప్పుడు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. పండుగ అమ్మకాల కోసం తెచ్చిన స్టాకులు ఉండిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. రైతుల చేతికి పూర్తిస్థాయిలో సొమ్ములు లేకపోవడమే వ్యాపారాల క్షీణతకు కారణమంటున్నారు. కర్షకుల ఇంట కొరవడ్డ హర్షం ఈ సంక్రాంతికి రైతుల ఇంట పండుగ కాంతులు కరువయ్యాయి. పెద్ద పండుగ వాణిజ్యం అంతా చాలా వరకు తొలకరి ఫలసాయంపైనే ఆధారపడుతుంది. వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని పెద్దనోట్ల రద్దు సంక్షోభం ఆవిరి చేసింది. మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోళ్లు జరిగినా చేతికి చిల్లిగవ్వ దక్కని పరిస్థితి. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములున్నా రూ.రెండు వేల కోసం రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి. తొలకరి సాగు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చేదారి లేక, దాళ్వా సాగుకు పెట్టుబడులు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రబీ నాట్లు పూర్తికావాల్సి ఉండగా పెట్టుబడులు పెట్టేందుకు సొమ్ములేక సాగు తీవ్ర జాప్యమవుతోంది. దీంతో రైతుల ఇంట పండుగ కాంతులు కరువవుతున్నాయి. తాజాగా ఏటీఏంలలో రూ.4,500 వరకు విత్‌డ్రాయల్‌కు అనుమతినిచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత ఫర్వాలేదనిపిస్తున్నా, పల్లెల్లో చాలా వరకు నగదు సంక్షోభం కొనసాగుతోంది. ఏటీఎంలు లేక నగదు కోసం బ్యాంకుల వద్ద పల్లె ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. చాలా మంది ఇంటికి పెయింటింగ్స్ కూడా వేయించలేని పరిస్థితులతో పెయింటింగ్ వర్కర్లకు ఉపాధి కరువైంది. బ్యాంకుల చుట్టూ తిరగడమే పనిగా ఉంది.. ‘నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ధాన్యం అమ్మినా నగదు ఇంకా చేతికి రానే లేదు. బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోతోంది. తొలకరి పంట అపులింకా తీర్చనే లేదు. దాళ్వా పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొన్న ఆగస్టు చివర్లో మా అమ్మాయి పెళ్లి చేశాను. ఇప్పుడేమో పండగ వచ్చేస్తోంది. అల్లుడికి, వియ్యపు వారికి బట్టలు పెట్టాలి. ఇంకా లాంఛనాలు ఉంటాయి. పెళ్లి జరిగిన ఇల్లు కావడంతో మొదటి పండుగను బాగా జరుపుకుందామనుకున్నాం. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు మామిడికుదురు మండలం నగరానికి చెందిన మేడిచర్ల సుబ్బారావు. ఇది ఆయన ఒక్కడి ఆవేదనే కాదు.. పెద్ద పండుగ దగ్గరకొస్తున్న వేళ జిల్లావ్యాప్తంగా ఎంతోమంది రైతుల ఆక్రోశం ఇది. మట్టిని మథించి, సృష్టించిన పంటను అమ్మినా చేతిలో చిల్లిగవ్వ లేక, రెండో పంటకు పెట్టుబడులు లేక ఇబ్బందులు పడుతున్నా తరతరాలు వస్తున్న పెద్ద పండుగ సాంప్రదాయాన్ని ఏదోవిధంగా కొనసాగించుకోవాలన్న తపనతో వ్యవసాయాధారిత పేద, మధ్యతరగతి కుటుంబాల వారు అగచాట్లు పడుతున్నారు. అంతంత మాత్రంగానే జరుపుకోవాలి.. పెద్ద నోట్ల దెబ్బతో ఈ ఏడాది సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించడం లేదు. నాలుగు ఎకరాలు సాగుచేస్తే ఆ నగదు సుమారు రూ.లక్ష బ్యాంకు ఖాతాలో పడింది. తీరా బ్యాంకుకు వెళితే రూ.2వేలు, రూ.4వేలు చొప్పున ఇచ్చారు. పాత బాకీలు కట్టలేదు. ఇబ్బందులు తీరలేదు. రూ.24 వేలు చొప్పున ఒకేసారి ఇస్తే బాగుండేది. రబీ పనులకు సంబంధించి నగదు బ్యాంకు ఖాతా నుంచి తీసుకోడానికి వీలు లేక తీవ్ర ఇబ్బందులతో వెద సాగు చేపట్టాను. మరో మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్ నుంచి అల్లుడు, కూతురు వస్తున్నారు. చేతిలో నగదు లేక ఈ పండుగ అంతంతమాత్రంగా జరుపుకోవాల్సి వస్తుంది. – పంపన సూర్యనారాయణ, రైతు, కాండ్రేగుల, పెదపూడి మండలం నగదు రహితంతో ఆనందం దూరం నా సొంత వ్యవసాయం 5 ఎకరాలతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. శిస్తులతో పాటు కూలీలకు పండుగ డబ్బులు ఇవ్వాలంటే అప్పు దొరికే పరిస్థితిలేదు. నగదు రహిత లావాదేవీల పుణ్యమాని రైతుల కుటుంబాల్లో సంక్రాంతి ఆనందం కరువైంది. బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాం. రబీ సీజ¯ŒSలో పెట్టుబడికి సోమ్ములు లేక అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఏటా సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా జరుపుకునేవాళ్లం. ఈ ఏడాది పండుగ వస్తుందన్న ఆనందం లేదు. – ముదునూరి సత్యనారాయణరాజు, రైతు, ఆత్రేయపురం పనుల్లేక ఖాళీగా ఉన్నాం.. సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి పెయింటింగ్ వర్కర్లకు ఖాళీ ఉండేది కాదు. ఉన్న వాళ్లం సరిపోక బయటి నుంచి కూలీలను పెట్టుకునేవాళ్లం. ఇప్పు డా పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో చేతిలో డబ్బుల్లేక చాలామంది పెయింటింగ్స్ వేయించడం లేదు. వర్కర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – కొల్లి విశ్వనాథం, జగ్జీవన్‌రామ్ పెయింటింగ్ వర్కర్స్ సంఘం వ్యవస్థాపకుడు, మండపేట బంగారం అమ్మకాలు తగ్గిపోయాయి.. సంక్రాంతి సీజ¯ŒSలో అల్లుళ్లకు కానుకలుగా పెట్టేందుకు ఎక్కువగా ఆర్డర్లు వచ్చేవి. ఉంగరాలు, గొలుసులు, బ్రాస్లెట్లు తదితర బంగారు వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. ఈ సారి తయారీకి వచ్చే ఆర్డర్లు, అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం కూడా వ్యాపారం జరగడం లేదు. – మహంతి అసిరినాయుడు, జ్యూయలరీ షాపు, మండపేట నెలరోజుల పనికి కూలిడబ్బులు లేవు.. నెల రోజులుగా కూలి పనులకు వెళుతున్నాం. రైతుల నుంచి రూ.10 వేల వరకు కూలి సొమ్ములు రావాల్సి ఉంది. పండగేమో దగ్గరకు వచ్చేస్తోంది. ఇంటికి బంధువులు వస్తారు. మేము కొత్త బట్టలు తీసుకోవాలి. పిండివంటలు చేయించుకోవాలి. నెలరోజుల పాటు పనిచేసిన డబ్బులేవు. రైతుల దగ్గర పంట డబ్బులు లేక కూలీలు అందరూ ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారు. – కాపారపు దుర్గారావు, వ్యవసాయ కూలీ, మర్రిపాక, జగ్గంపేట మండలం పండుగ జరుపుకోవడం పెద్ద కష్టమే.. సంక్రాంతి పండుగను జరుపుకోవడం పెద్ద కష్టంగానే ఉంది. నెల రోజుల క్రితమే మా కుమార్తెకు వివాహం చేశాం. అప్పట్లో పెద్దనోట్ల రద్దుతో బ్యాంకు నుంచి మా డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెండునెలలైనా ఇంకా ఇబ్బందులు అలానే ఉన్నాయి. ఈ పండుగ బాగా చేసుకోవాలనుకున్నాం. పరిస్థితిలో మార్పురాకపోవడం సమస్యగా ఉంది. – పి.విద్యారావు, చెల్లూరు, రాయవరం మండలం పంట అమ్మినా చేత పైకం లేదు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెతో కూడిన కుటుంబం మాది. మూడు ఎకరాల్లో పంట పండించా ను. పంటను ఒబ్బిడి చేసుకుని దాదాపు వంద బస్తాలు కమీష¯ŒS ఏజెంటు ద్వారా మిల్లర్‌కు విక్రయిం చాను. ధాన్యానికి రావాల్సిన సొమ్ములను మిల్లర్ ఖాతాలో వేశారు. డబ్బులు పడి రెండు వారాలు కావస్తున్నా పెద్ద నోట్ల రద్దుతో విత్ డ్రాల పరిమితులతో డబ్బులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. చెమటోడ్చి పండించి నా వచ్చే పండుగలకు పైసల్లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. డబ్బులందక కూలీలకు వేతనాలు పూర్తిగా ఇవ్వలేదు. ఎరువుల దుకాణంలో అప్పు అలానే ఉంది. పండక్కి పిల్లలకు నూతన వస్రా్తలు కొనలేదు. ఇంట్లో పండుగ సరుకు లు కొనలేదు. మూడు ఎకరాల రైతునై ఉండీ, 100 బస్తాలు పండించిన ధీమా ఉండి.. చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితి ఏర్పడింది. – అరిగెల సత్యనారాయణ, భీమనపల్లి శివారు సుదాపాలెం, ఉప్పలగుప్తంమండలం -
అంతా ‘జన్మభూమి’ జపం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పాలన స్తంభించింది. అధికారులంతా జన్మభూమి జపం చేస్తున్నారు. రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జన్మభూమి కార్యక్రమం పేరుతో జిల్లా అధికారులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రతి రోజూ నిర్వహించే సమావేశాలు, వారం వారం సమీక్షల క్యాలెండర్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాలన స్తంభించింది. కలెక్టరేట్ బోసిపోతోంది. ఈనెల 2వ తేదీ నుంచి ఇదే దుస్థితి నెలకొంది. జన్మభూమి తర్వాత 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు కార్యాలయాలు పనిచేసినా అప్పుడు పండగ కోలాహలం నేపథ్యంలో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఎలాగూ పండగ సెలవులు ఉంటాయి. అంటే నెలలో సగం రోజులు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా సమస్యలను అధికారులు గాలికి వదిలేసినట్టయింది. ప్రస్తుతం ప్రజలు కార్యాలయాలకు వస్తున్నా.. అధికారులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరు జన్మభూమి గ్రామసభలు ముగిసిన అనంతరం కార్యాలయాలకు వస్తున్నా.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పటికే ‘మీకోసం’ రెండువారాలు రద్దు ప్రతి సోమవారం జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం నేపథ్యంలో ఇప్పటికే రెండు వారాల పాటు కలెక్టర్ రద్దు చేశారు. మండల కేంద్రాల్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాలకూ మంగళం పాడారు. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. రైతులను గాలికొదిలేశారు ప్రస్తుతం రబీ సీజ¯ŒS ప్రారంభ దశలో ఉంది. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సాగునీరు, రుణాలు అందక అవస్థలు పడుతున్నారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. -
వాణిజ్య పన్నులశాఖ ఆదాయం డల్
* నోట్ల రద్దుతో డిసెంబర్లో ప్రభావం * స్వైపింగ్ మిషన్ల పై సర్వీస్ ట్యాక్స్ సడలిస్తేనే పరిస్థితులు చక్కబడతాయి * వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు గుంటూరు (నగరంపాలెం): పెద్ద నోట్ల రద్దు కారణంగా డిసెంబరులో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. గుంటూరులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరులో రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు నోట్ల కొరత కారణంగా తగ్గిపోవటంతో డిసెంబరులో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం తగ్గిపోనుందన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రిటైల్ వ్యాపారులకు పీవోఎస్ మిషన్లు అందించే బాధ్యతను.. వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి ప్రభుత్వం అప్పగించిందన్నారు. కానీ స్వైపింగ్ మిషన్ల ద్వారా నగదు లావాదేవీలు చేయటంతో అదనంగా బ్యాంకులు వసూలు చేసే సర్వీస్ చార్జి కారణంగా రిటైల్ వ్యాపారస్తులు ముందుకు రావటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీవోఎస్ మిషన్ల ద్వారా జరిగే నగదు లావాదేవీలపై సర్వీస్ చార్జిని ఎత్తివేసి కనీస అద్దెను బ్యాంకులు వసూలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే నగదు ఇబ్బందుల నుంచి ప్రజలు, వ్యాపారస్తులు అధిగమిస్తారన్నారు. -
నిర్లక్ష్యంలో ‘ఇన్స్పైర్’
♦ జిల్లాకు 833 అవార్డులు మంజూరు ♦ కేవలం 156 మందికి నగదు జమ ♦ ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ♦ 25 నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులను భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘ఇన్‌సె్పౖర్’ (ఇన్నోవేషన్ ఆఫ్ సైన్స్ ఫెర్షూట్ ఫర్ ఇన్స్పిరీడ్ రీసెర్చ్)కు 2011లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ సక్తి ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే గ్రామీణ వి ద్యార్థులను సైన్స్పట్ల ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోంది. ప్ర యోగాలకు ఉపయోగించే వివిధ వస్తువుల కొనుగోలు కు డబ్బులు ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ. 5 వేలు ఖ ర్చు చేస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వం ఈవిషయం లో వెనుకడుగు వేస్తోంది. పది రోజుల్లో జిల్లాస్థాయి ఇ న్సె్పౖర్ ప్రారంభం కానుంది. అయినా నేటికీ వందల సంఖ్యలో విద్యార్థులకు అవార్డు మొత్తం జమ కాలేదు. దీంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 156 మంది విద్యార్థులకు మాత్రమే నగదు జమ ఈ విద్యా సంవత్సరం (2016–17)లో జిల్లా నుంచి మొత్తం 2,256 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకున్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేయించారు. అయితే వీరిలో 833 మందిని జిల్లాస్థాయి ఇన్‌సె్పౖర్‌కు ఎంపిక చేశారు. అందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వివరాలను అధికారులకు పంపారు. ఒక్కొక్కరికి రూ. 5 వేలు ప్రకారం రూ. 41.65 లక్షలు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పటికి కేవలం 156 మంది విద్యార్థుల అకౌంట్లలో మాత్రమే రూ. 5 వేలు చొప్పున జమ చేశారు. 25 నుంచి జిల్లాస్థాయి ఇన్‌సె్పౖర్ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి వి ద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌సె్పౖర్) ఈనెల 25, 26, 27 తే దీల్లో అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వా రి ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఉంటే వాటిద్వారా వివిధ వస్తువులు కొనుగోలు చేసి ప్రదర్శనకు సన్నద్ధం అవుతారు. జమ అవుతుందో...కాదో కూడా తెలీని పరిస్థితి చాలామంది విద్యార్థులది. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఏం చేయాలో? చాలా తక్కువమందికి అవా ర్డు మొత్తం జమ అయింది. ఏం చేయాలో మాకూ అర్థం కాలేదు. ఆందోళన చెందుతున్నాం. ఢిల్లీ వారితో కూడా సంప్రదించాం. వారు అదిగో...ఇదిగో అంటున్నారు. మా చేతుల్లో ఏముంది. ఇన్ౖస్పైర్ తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటిదాకా సుమారు 160 మంది అకౌంట్లలో అవార్డు మొత్తం జమ అయింది. ఎంతమందికి వస్తే వారితోనే ఇన్‌సె్పౖర్ ప్రదర్శనలు చేయిస్తాం. –అంజయ్య, డీఈఓ -
అంతా తూచ్..!
– పేరుకు మాత్రమే బహిరంగ మల విసర్జన రహిత మునిసిపాలిటీలు – క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు – కనిపించని మరుగుదొడ్లు అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ఈ నెల 2 నాటికి అన్ని మునిసిపాలిటీలను బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్ ఫ్రీ)ంగా తీర్చి దిద్దుతామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి లేదు. జిల్లాలోని అధిక మునిసిపాలిటీల్లో ఇప్పటికీ మహిళలు, చిన్నారులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లే దుస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరిట వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించింది. వాస్తవంగా 2019 డిసెంబర్‌కల్లా బహిరంగ మల విసర్జన రహితం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించింది. జిల్లాలో తాడిపత్రి మునిసిపాలిటీ మాత్రమే 100 శాతం లక్ష్యానికి చేరుకుంది. ఇక అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, తదితర మునిసిపాలిటీల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. నగరంలోనే అధ్వానం : జిల్లా కేంద్రంలోని రాజమ్మకాలనీ ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తోంది. నాలుగు నెలల కిందట ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. టాయిలెట్స్ ఏవీ..? నగరంలో టాయిలెట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో టాయిలెట్స్ లేక మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘పే అండ్ యూజ్’ టాయిలెట్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారుల టెండర్లను ఆహ్వానించారు. కొందరు ముందుకొచ్చిన వాటి నిర్మాణం మొదలవలేదు. అధికారిక లెక్కలిలా: మునిసిపల్ అధికారుల లెక్కల ప్రకారం రీజియన్‌లోని 11 మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో దాదాపుగా వందశాతం లక్ష్యాలను అధిగమించామని చెబుతున్నారు. అనంతపురం 98 శాతం, ధర్మవరం 99శాతం, గుత్తి, 97శాతం, గుంతకల్లు 96 శాతం, కదిరి 98, కళ్యాణదుర్గం 99 శాతం, పామిడి 98, పుట్టపర్తి 98శాతం, రాయదుర్గం 95 శాతం, తాడిపత్రి 100 శాతం, మడకశిర 94 శాతం, హిందూపురం 98 శాతం అయ్యిందని అధికారులు చెబుతున్నారు. –––––––––––––––––– వందశాతం అధిగమించాం.. బహిరంగ మల విసర్జన రహిత లక్ష్యాలను వందశాతం అధిగమించాం. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను అధిగమిస్తాం. బహిరంగ మల విసర్జన చేస్తే రూ 5 వేలు జరిమాన విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఎవరూ బహిరంగంగా మల,మూత్రం చేయరాదు. – విజయలక్ష్మి, ఆర్డీ -
వర్షం.. తగ్గుముఖం
ఖమ్మం వ్యవసాయం: వరుణుడు శాంతించాడు. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహ ఉధృతి తగ్గుతోంది. జలాశయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. నీట మునిగిన పంటలను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి నైరుతి రుతు పవనాలకు తోడవడంతో దాదాపు పది రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ అధిక వర్షాలతో పంటలు నీట మునిగాయి. కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. తగ్గిన వర్ష తీవ్రత వర్షాలు మంగళవారం నుంచి తగ్గుముఖం పట్టాయి. బుధవారం జిల్లా సగటు వర్షపాతం (మంగళవారం ఉదయం 10 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు) 7.6 మి.మీ.లుగా నమోదైంది. బుధవారం జిల్లాలో ఎనిమిది మినహా మిగతా అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. పినపాక మండలంలో 4.18 సెం.మీ., అశ్వాపురం మండలంలో 3.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మణుగూరు, కామేపల్లి, కొణిజర్ల, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, బోనకల్లు మండలాల్లో 3 సెం.మీ. వరకు వర్షం కురిసింది. పెనుబల్లి, అశ్వారావుపేట, ముల్కలపల్లి, గార్ల, టేకులపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన 23 మండలాల్లో 1 సెం.మీ. లోపు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 164 మి.మీ.లు. ఇప్పటికే 280.4 మి.మీ. వర్షపాతం (83.4 శాతం అధికం) నమోదైంది. సాధారణ స్థితికి జలాశయాలు అధిక వర్షాలతో ఉగ్రరూపందాల్చిన జలాశయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వాగులు, చెరువులు, కుంటల అలుగుల నుంచి నీటి ప్రవాహం తగ్గింది. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మందగించడంతో ఔట్‌ఫ్లో తగ్గింది. పంటల రక్షణ పనుల్లో రైతులు నిమగ్నం వర్షాలు తగ్గడంతో, నీట మునిగిన పంటలను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అధిక వర్షాలు, వరదలతో అనేకచోట్ల పత్తి చేనుల్లోకి, మిరప తోటల్లోకి; కొన్నిచోట్ల మొక్కజొన్న చేలల్లోకి వరద నీరు చేరింది. భూమిలో అధిక తేమ కారణంగా పైర్లు ఎర్రబారాయి. వేరుకుళ్లు, ఇతర తెగుళ్లు ఆశించాయి. నిల్వ నీటి తొలగింపు, తెగుళ్ల నివారణ, మందు పిచికారీ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో పంటలకు పెద్దగా నష్టం జరగలేదని; అశ్వారావుపేట, కొత్తగూడెం మండలాల్లో మాత్రమే పంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పంటలు 50 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిగణలోకి తీసుకుంటామని, ఈ రెండు మండలాల్లో కూడా 30 శాతం వరకు మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని వారు అంచనా వేశారు. -
వర్షం లోటే...
జూలైలో ముఖం చాటేసిన వరుణుడు ∙ చివరిలో కాస్త ఆశాజనకం అమలాపురం : జూలైలో వరుణుడు ముఖం చాటేశాడు. జిల్లాలో సగటు కన్నా తక్కువ వర్షం కురవడంతో అన్నదాత నిరాశ చెందుతున్నాడు. నెల చివరిలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షం తప్ప చెప్పుకునేంత వర్షం లేదు. జిల్లా వ్యాప్తంగా 239 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 189.5 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. జిల్లావ్యాప్తంగా 20.8 లోటు వర్షం పడింది. మెట్టలోని తుని, కోటనందూరు, జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో మాత్రం సగటు కన్నా ఎక్కువ వర్షం నమోదవగా, మిగిలిన మెట్ట, డెల్టా, ఏజెన్సీ మండలాల్లో తక్కువ వర్షం పడింది. కడియం, తాళ్లరేవు, కె.గంగవరం మండలాల్లో వర్షపు లోటు ఎక్కువగా ఉంది. అయితే వర్షాకాలం ఆరంభమైన తరువాత జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు కురిసిన వర్షం సగటు కన్నా 24 శాతం అధికంగా ఉండడం విశేషం. జూన్ నెలలో రికార్డు స్థాయిలో వర్షం కురవడం వల్ల అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు మొఖం చాటేయడం వల్ల ఖరీఫ్ సాగుకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా మెట్టలోని ఏలేరు, పంపా, చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ముందడుగు పడడం లేదు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్ ప్రశ్నార్ధకంగా మారింది.