
టీడీపీలో అంతర్గత విబేధాలు - శిలాఫలకం ధ్వంసం
టీడీపీలో మరోసారి అంతర్గత విబేధాలు తలెత్తాయి. నూజెండ్ల మాజీ ఎంపీపీ లగడపాటి వెంకటేశ్వర్లు పేరు శిలాఫలకంపై వేయలేదని ఆయన అనుచరులు శిలాఫలకాలన్ని ధ్వంసం చేశారు. దీంతో కార్యక్రమం వాయిదా పడింది. పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నూజెండ్ల రావాల్సి ఉంది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడను ఎంపీ నిధులతో పాటు స్థానికుల సహకారంతో నిర్మించారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. దానికి మాజీ ఎంపీపీ కూడా సహాయం చేశారు. విరాళం ఇచ్చిన మాజీ ఎంపీపీ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులే శిలాఫలకం ధ్వంసం చేసి ఉంటారని.. కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.